Online Shopping: గుడ్ న్యూస్... ఏప్రిల్ 20న ఆన్‌లైన్ షాపింగ్ ప్రారంభం

Online Shopping | లాక్‌డౌన్‌కు ముందు ఆన్‌లైన్ షాపింగ్‌లో ఏవైనా వస్తువులు కొన్నారా? ఆన్‌లైన్ షాపింగ్ చేయాలనుకుంటున్నారా? ఏప్రిల్ 20న ఆన్‌లైన్ షాపింగ్ ప్రారంభం కానుంది.

news18-telugu
Updated: April 16, 2020, 5:09 PM IST
Online Shopping: గుడ్ న్యూస్... ఏప్రిల్ 20న ఆన్‌లైన్ షాపింగ్ ప్రారంభం
ఏపీ ప్రభుత్వానికి షాక్... కేంద్రం కీలక సంచలన నిర్ణయం... (File)
  • Share this:
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా ఆన్‌లైన్ షాపింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి ఇ-కామర్స్ కంపెనీలు ఆన్‌లైన్ షాపింగ్‌ను ఆపేశాయి. కేవలం నిత్యావసర వస్తువులు, సరుకుల్ని మాత్రమే డెలివరీ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 20 నుంచి కొన్ని సడలింపుల్ని అమలు చేస్తోంది. ఇందుకోసం గైడ్‌లైన్స్ కూడా విడుదల చేసింది కేంద్ర హోమ్ శాఖ. మొబైల్స్, టీవీలు, ఇతర నాన్ ఎసెన్షియల్ గూడ్స్‌ని అమ్మేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఏప్రిల్ 20 నుంచి ఇ-కామర్స్ సైట్లు ఆర్డర్స్ తీసుకోనున్నాయి. గతంలో ఆర్డర్ చేసి, వేర్‌హౌజ్‌లల్లో ఉన్న ప్రొడక్ట్స్ కూడా కస్టమర్లకు ఏప్రిల్ 20 నుంచి డెలివరీ కానున్నాయి. వేర్‌హౌజ్‌లు, గ్రామీణ ప్రాంతాల్లోని యూనిట్లు, స్పెషల్ ఎకనమిక్ జోన్స్, ఎక్స్‌పోర్ట్ జోన్స్‌లో ఉద్యోగులు పనిచేసేందుకు కూడా అనుమతి లభించింది. కానీ సోషల్ డిస్టెన్స్ ప్రమాణాలు పాటించడం తప్పనిసరి.

మొదటి లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ షాపింగ్ పూర్తిగా నిలిచిపోయింది. కేవలం నిత్యావసర వస్తువుల్ని డెలివరీ చేసేందుకు మాత్రమే కేంద్రం అనుమతి ఇచ్చింది. కానీ చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండటంతో ల్యాప్‌టాప్స్, డెస్క్‌టాప్స్, కంప్యూటర్ పరికరాలు, స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ మోడెమ్స్‌కు డిమాండ్ పెరిగింది. కానీ వాటిని కొనే పరిస్థితి లేదు. బయట షాపులు మూతపడ్డాయి. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసే పరిస్థితి లేదు. దీంతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏప్రిల్ 20 నుంచి లాక్‌డౌన్‌లో కొన్ని మినహాయింపులు ఉండటంతో ఇ-కామర్స్ సైట్లకు కూడా అనుమతి ఇచ్చింది కేంద్రం. టీవీలు, ఫ్రిజ్, ఏసీ, కూలర్ లాంటివన్నీ కస్టమర్లు ఆర్డర్ చేయొచ్చు.

ఇవి కూడా చదవండి:

Moratorium: 3 ఈఎంఐలు వాయిదా వేస్తే ఇంకా ఎక్కువ ఈఎంఐలు కట్టాలి

Airtel: ఎయిర్‌టెల్ నుంచి ఆల్ ఇన్ వన్ హోమ్ ప్లాన్... బెనిఫిట్స్ ఇవే

Prepaid Plans: రూ.200 లోపు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్లాన్స్ ఇవే
First published: April 16, 2020, 5:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading