Home /News /coronavirus-latest-news /

INDIA LOCKDOWN EXTENDED TILL JUNE 30 MHA ISSUES NEW GUIDELINES BA

Lockdown 5 | జూన్ 30 వరకు లాక్ డౌన్... కేంద్రం కొత్త రూల్స్ ఇవే...

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ లాక్ డౌన్ 5లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సడలింపులు జూన్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ లాక్ డౌన్ 5లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సడలింపులు జూన్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి.

దేశవ్యాప్తంగా లాక్ డౌన్‌ను జూన్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

    దేశవ్యాప్తంగా లాక్ డౌన్‌ను పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈసారి లాక్ డౌన్ 5.0ను 30 రోజుల పాటు పొడిగించింది. జూన్ 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు లాక్ డౌన్‌ను పొడిగిస్తున్నట్టు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, లాక్ డైన్ 5లో ప్రజలకు కొత్త మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. జూన్ 8 నుంచి ఆలయాలు, ప్రార్థనా స్థలాలు కూడా ఓపెన్ చేసుకోవచ్చునంటూ ప్రకటించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను కేంద్రం పరిమితం చేసింది. రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి, అలాగే, మరో రాష్ట్రానికి వెళ్లడానికి ఎలాంటి అనుమతులు అవసరం లేదు.

    లాక్ డౌన్‌కు సంబంధించి కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఆదేశాలు...

    • కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ జూన్ 3 వరకు కొనసాగుతుంది.

    • కంటైన్మెంట్ జోన్ పరిధిని జిల్లా యంత్రాంగం నిర్దేశిస్తుంది. కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ద్వారా జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి.

    • కంటైన్మెంట్ జోన్లలో కేవలం నిత్యావసరాలకు మాత్రమే అనుమతి ఉండాలి. ఆ జోన్లలో నుంచి ప్రజలు బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.

    • కంటైన్మెంట్ జోన్ బయట బఫర్ జోన్లపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్ణయం తీసుకోవచ్చు. బఫర్ జోన్లలో జిల్లా అధికారులు షరతులు విధించొచ్చు.


    లాక్ డౌన్ 5పై కేంద్రం మార్గదర్శకాలు


    వివిధ దశల్లో వివిధ రకాలైన సంస్థలు తెరవడానికి అనుమతులు ఇస్తూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

    ఫేజ్ 1 (జూన్ 8, 2020)
    ఫేజ్ 1లో ప్రార్థనా స్థలాలకు అనుమతి ఉంటుంది. జూన్ 8 నుంచి ఆలయాలు, చర్చిలు, మసీదులు తెరవొచ్చు. హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకోవచ్చు. అయితే, కుటుంబసంక్షేమ శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తుంది.

    లాక్ డౌన్ 5పై కేంద్రం మార్గదర్శకాలు


    ఫేజ్ 2 (జూలై 2020)
    ఫేజ్ 2లో స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు తెరవొచ్చు. అది కూడా జూలైలో. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు.. విద్యార్థుల తల్లిదండ్రులు, వాటా దారులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి.

    లాక్ డౌన్ 5పై కేంద్రం మార్గదర్శకాలు


    ఫేజ్ 3
    అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, మెట్రో రైళ్ల సేవలు, సినిమా హాళ్లు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్‌లు, ధియేటర్లు, బార్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాళ్లు లాంటివి ఎప్పుడు తెరవాలనే అంశంపై ఫేజ్ 3లో నిర్ణయం తీసుకుంటారు. సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భారీ ఎత్తు ఫంక్షన్లు జరపకూడదు. పరిస్థితిని బట్టి వాటిని ఎప్పుడు తెరవాలో నిర్ణయిస్తారు.

    లాక్ డౌన్ 5పై కేంద్రం మార్గదర్శకాలు


    లాక్ డౌన్ 5 అంటూనే ‘అన్ లాక్ 1’  అంటూ కేంద్ర హోంశాఖ ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. అంటే, ఓ రకంగా కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం చేయడం ద్వారా మిగిలిన అందరూ బయటకు వస్తున్నట్టేనని పరోక్షంగా ప్రకటించింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Lockdown, Lockdown relaxations

    తదుపరి వార్తలు