Home /News /coronavirus-latest-news /

INDIA LOCKDOWN EXTENDED IRCTC TO PROVIDE FULL REFUND ON E TICKETS FOR INDIAN RAILWAYS CANCELLED TRAINS SS

IRCTC: రైలు టికెట్లపై ఫుల్ రీఫండ్ వస్తుందా? క్లారిటీ ఇచ్చిన ఐఆర్‌సీటీసీ

IRCTC: రైలు టికెట్లపై ఫుల్ రీఫండ్ వస్తుందా? క్లారిటీ ఇచ్చిన ఐఆర్‌సీటీసీ
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC: రైలు టికెట్లపై ఫుల్ రీఫండ్ వస్తుందా? క్లారిటీ ఇచ్చిన ఐఆర్‌సీటీసీ (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC on Refund | మీరు మే 3 వరకు రైలు టికెట్లు బుక్ చేసుకున్నారా? భారతీయ రైల్వే అప్పటివరకు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. రీఫండ్‌పై ఐఆర్‌సీటీసీ క్లారిటీ ఇచ్చింది.

    భారతదేశంలో లాక్‌డౌన్ మే 3 వరకు కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో భారతీయ రైల్వే అన్ని ప్యాసింజర్ రైళ్లను మే 3 వరకు రద్దు చేస్తున్నట్టు అధికారికంగా వెల్లడించింది. అయితే ఏప్రిల్ 14 వరకు రద్దైన రైళ్లలో టికెట్లు బుక్ చేసుకున్నవారి రీఫండ్ విషయంలో గందరగోళం తలెత్తిన సంగతి తెలిసిందే. రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు టికెట్లను క్యాన్సిల్ చేసుకున్నారు. వారికి క్యాన్సలేషన్ ఛార్జీలు వర్తించాయి. దీంతో ప్రయాణికులు కంప్లైంట్ చేయడంతో వారికి మిగతా మొత్తాన్ని రీఫండ్ చేసింది రైల్వే. ఇప్పుడు మే 3 వరకు రైళ్లు రద్దు కావడంతో ఐఆర్‌సీటీసీ అప్రమత్తమైంది. రైలు టికెట్లపై రీఫండ్ విషయంలో స్పష్టత ఇచ్చింది. భారతీయ రైల్వే రద్దు చేసిన అన్ని రైళ్లల్లో టికెట్లు బుక్ చేసుకున్నవారికి ఫుల్ రీఫండ్ ఇస్తామని ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. ప్రయాణికులు ఇ-టికెట్లను క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఏ కార్డులు, అకౌంట్లు, వ్యాలెట్ల ద్వారా పేమెంట్ చేస్తే ఆ అకౌంట్లలోకే రీఫండ్ వస్తుందని ప్రకటించింది.


    ప్రయాణికులు తమ టికెట్లను క్యాన్సిల్ చేయకపోవడమే మంచిది. గతంలో టికెట్లు క్యాన్సిల్ చేసినవారికి క్యాన్సలేషన్ ఛార్జీలు మినహాయించి మిగతా రీఫండ్ వచ్చింది. ఆ తర్వాత క్యాన్సలేషన్ ఛార్జీలను కూడా రీఫం చేసింది ఐఆర్‌సీటీసీ. ప్రయాణికులు టికెట్లు రద్దు చేస్తే ఈ సమస్య వచ్చే అవకాశముంది. ఐఆర్‌సీటీసీ టికెట్లను క్యాన్సిల్ చేస్తే పూర్తి రీఫండ్ వస్తుంది. అయితే కోట్లాది ప్రయాణికుల టికెట్లు రద్దు కావడంతో రీఫండ్ కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు ఐఆర్‌సీటీసీ తక్కువ సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహిస్తున్నందున జాప్యం తప్పదు. కాబట్టి ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టికెట్లు క్యాన్సిల్ అయిన 4 నుంచి 7 రోజుల్లో రీఫండ్ అకౌంట్‌లో జమ అవుతుంది.

    ఇవి కూడా చదవండి:

    SBI: ఆ ఎస్ఎంఎస్ వస్తే డిలిట్ చేయండి... ఖాతాదారులకు ఎస్‌బీఐ అలర్ట్

    EMI Moratorium: మారటోరియం విషయంలో ఈ తప్పు చేస్తే మీ అకౌంట్ ఖాళీ

    Prepaid Plans: రోజూ 1.5 జీబీ డేటా... జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ నుంచి ప్లాన్స్ ఇవే
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Corona, Corona virus, Coronavirus, Covid-19, Indian Railway, Indian Railways, Irctc, Lockdown, Railways, Train, Train tickets

    తదుపరి వార్తలు