హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Indian Railways: మే 3 వరకు అన్ని రైళ్లు రద్దు... ప్రకటించిన రైల్వే

Indian Railways: మే 3 వరకు అన్ని రైళ్లు రద్దు... ప్రకటించిన రైల్వే

Indian Railways: మే 3 వరకు అన్ని రైళ్లు రద్దు... ప్రకటించిన రైల్వే
(ప్రతీకాత్మక చిత్రం)

Indian Railways: మే 3 వరకు అన్ని రైళ్లు రద్దు... ప్రకటించిన రైల్వే (ప్రతీకాత్మక చిత్రం)

Indian Railways | రైలు టికెట్లు బుక్ చేసుకున్నవారికి అలర్ట్. భారతీయ రైల్వే మే 3 వరకు అన్ని రైళ్లను రద్దు చేసింది.

  భారతదేశంలో మే 3 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా ప్రకటించారు. భారతదేశంలో మొదట లాక్‌డౌన్‌ను 21 రోజుల పాటు అంటే ఏప్రిల్ 14 వరకు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో భారతీయ రైల్వే అన్ని రైళ్లను ఏప్రిల్ 14 వరకు రద్దు చేసింది. ఇప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 3 వరకు లాక్‌డౌన్ ఉంటుందని ప్రకటించడంతో భారతీయ రైల్వే అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. అన్ని ప్యాసింజర్ రైళ్లు, ప్రీమియం రైళ్లు, మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సబర్బన్ రైళ్లు, కోల్‌కతా మెట్రో రైల్, కొంకణ్ రైల్వే లాంటి సేవలన్నీ 2020 మే 3 వరకు రద్దు చేస్తున్నామని భారతీయ రైల్వే ట్విట్టర్‌లో వెల్లడించింది. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేవరకు ఐఆర్‌సీటీసీలో ఎలాంటి బుకింగ్స్, అడ్వాన్స్ రిజర్వేషన్స్ ఉండవని రైల్వే క్లారిటీ ఇచ్చింది.

  లాక్‌డౌన్ సమయంలో భారతీయ రైల్వే కేవలం గూడ్స్ రైళ్లు నడుపుతున్న సంగతి తెలిసిందే. పాలు, నిత్యావసర వస్తువులు, వైద్య పరికరాలను సరఫరా చేసేందుకు మాత్రమే రైలు సేవల్ని వినియోగించుకుంది. ఇప్పుడు మే 3 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో గూడ్స్ రైళ్లు మాత్రమే నడిచే అవకాశం ఉంది. ప్యాసింజర్ రైళ్లన్నీ రద్దైనట్టే. మరి ఈ రైళ్లల్లో టికెట్లు బుక్ చేసుకున్నవారికి రీఫండ్ ఎలా ఇస్తారన్న దానిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. రైళ్లు రద్దు అయ్యాయి కాబట్టి టికెట్లు ఆటోమెటిక్‌గా క్యాన్సిల్ అవుతాయి. రీఫండ్ ప్రాసెస్ కూడా మొదలవుతుంది.

  ఇవి కూడా చదవండి:

  Indian Railways: రైలు టికెట్ క్యాన్సిల్ చేశారా? రీఫండ్‌ ఇలా పొందండి

  Coronavirus: ఆస్పత్రులుగా మారిపోతున్న రైళ్లు... 40,000 ఐసోలేషన్ బెడ్స్ రెడీ

  EMI Moratorium: మారటోరియం విషయంలో ఈ తప్పు చేస్తే మీ అకౌంట్ ఖాళీ

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Corona, Corona virus, Coronavirus, Covid-19, Indian Railway, Indian Railways, Irctc, Lockdown, Railways, Train, Train tickets

  ఉత్తమ కథలు