హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Omicron : ఒమిక్రాన్ వల్ల భారత్‌లో కరోనా మూడో వేవ్ -రోజుకు 1.5లక్షల కేసులు రాబోతున్నాయ్ : సైంటిస్టుల వార్నింగ్

Omicron : ఒమిక్రాన్ వల్ల భారత్‌లో కరోనా మూడో వేవ్ -రోజుకు 1.5లక్షల కేసులు రాబోతున్నాయ్ : సైంటిస్టుల వార్నింగ్

అలాగే కేరళలో బుధవారం నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు తమిళనాడు, పశ్చిమబెంగాల్ తొలి ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇరు రాష్ట్రాల్లో ఒక్కొక్క కేసు నమోదైనట్లు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు వెల్లడించాయి. తాజాగా నమోదైన కేసులతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 68కి చేరినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.

అలాగే కేరళలో బుధవారం నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు తమిళనాడు, పశ్చిమబెంగాల్ తొలి ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇరు రాష్ట్రాల్లో ఒక్కొక్క కేసు నమోదైనట్లు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు వెల్లడించాయి. తాజాగా నమోదైన కేసులతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 68కి చేరినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.

ఐఐటీ కాన్పూర్ సైంటిస్ట్ మనీంద్ర అగర్వాల్ అంచనా ప్రకారం.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వల్ల భారత్ లో ఫిబ్రవరి నాటికి మూడో వేవ్ తలెత్తనుంది. సెకండ్ వేవ్ లో వచ్చిన కేసుల కంటే ఎక్కువగా, థర్డ్ వేవ్ లో రోజుకు కనీసం 1లక్ష నుంచి 1.5లక్షల కొత్త కేసులు నమోదవుతాయని ఆయన చెప్పారు..

ఇంకా చదవండి ...

కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వల్ల భారత్ లో కొవిడ్ మూడో వేవ్ తప్పదని సైంటిస్టులు హెచ్చరించారు. సౌతాఫ్రికాలో పుట్టిన ఈ వేరియంట్ ను డెల్టా కంటే ప్రమాదకారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొనడం, ఇప్పటికే దాదాపు 40 దేశాలకు ఇది వ్యాపించడం, భారత్ లోనూ 23 కేసులు బయటపడటం, ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో సుమారు 100 మంది ప్రభుత్వాల రాడార్ నుంచి తప్పించుకుని తిరుగుతోన్న నేపథ్యంలో దేశంలో దీని వ్యాప్తి మరింత పెరుగుతోందని కాన్పూర్ ఐఐటీ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్‌ అంచనా వేశారు. కరోనా తొలి వేవ్ నుంచీ అగర్వాల్ చెప్పిన చాలా విషయాలు నిజం కావడంతో మూడో వేవ్ పై ఆయన చేసిన హెచ్చరికలు చర్చనీయాంశమయ్యాయి.

ఐఐటీ కాన్పూర్ సైంటిస్ట్ మనీంద్ర అగర్వాల్ అంచనా ప్రకారం.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వల్ల భారత్ లో ఫిబ్రవరి నాటికి మూడో వేవ్ తలెత్తనుంది. సెకండ్ వేవ్ లో వచ్చిన కేసుల కంటే ఎక్కువగా, థర్డ్ వేవ్ లో రోజుకు కనీసం 1లక్ష నుంచి 1.5లక్షల కొత్త కేసులు నమోదవుతాయని ఆయన చెప్పారు. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించినట్లుగా డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ ప్రమాదకారి అనడానికి ఇప్పటిదాకా ఎలాంటి ఆధారాలు లభించనప్పటికీ, వ్యాప్తి వేగం దృష్ట్యా ఒమిక్రాన్ అలజడి సృష్టించబోతుండం ఖాయమన్నారు.

etela rajenderపై ప్రతీకారం.. టీఆర్ఎస్‌ క్లర్కుగా కలెక్టర్ హరీశ్.. cm kcrపైనా జమున ఫైర్



సౌతాఫ్రికా సహా ఒమిక్రాన్ ప్రభావిత దేశాల్లో దాని వ్యాప్తిని క్షుణ్నంగా అధ్యయనం చేస్తున్నామని, ప్రస్తుతం సౌతాఫ్రికా సహా అన్ని దేశాల్లోనూ ఆస్పత్రుల్లో చేరే రోగుల సంఖ్య పెరగలేదని, వేగంగా వ్యాప్తి చెందే గుణం తప్ప డెల్టా అంతటి ప్రమాదకారిగా ఒమిక్రాన్ ఇప్పటికైతే లేదని అగర్వాల్ తెలిపారు. అయితే ఇండియాలో ఫిబ్రవరి నాటికి ఒమిక్రాన్ వ్యాప్తి పెరిగి థర్డ్ వేవ్ కు దారి తీసినా, మరణాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాల్లేవన్నారు. అయినాసరే ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకోడానికి ప్రభుత్వాలు.. డెల్టా వ్యాప్తి సమయంలో చేసినట్లుగా తేలికపాటి లాక్‌డౌన్‌ (రాత్రి కర్ఫ్యూ, రద్దీపై ఆంక్షలు) వంటివి విధిస్తే మెరుగైన ఫలితాలు రావొచ్చన్నారు.

High Court: కుటుంబంలో కన్న కూతురు కంటే కోడలికే ఎక్కువ హక్కులుంటాయి.. ఆమె విధవరాలైనా సరే..



ఒమిక్రాన్ పై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలతో దేశాలన్నీ అప్రమత్తమైన వేళ మెరికాకు చెందిన ప్రఖ్యాత సైంటిస్టు శారా గిల్బర్ట్ మరో బాంబు పేల్చారు. కరోనా మాత్రమే చివరి వైరస్ కాబోదని, రాబోయే రోజుల్లో పుట్టుకొచ్చే వైరస్ లు మరింత ప్రమాదకరంగా ఉండొచ్చని, మానవాళికి మరింత ప్రాణాంతకంగా ఉండొచ్చని హెచ్చరించారు. ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ వర్సిటీకి చెందిన జెన్నర్ ఇనిస్టిట్యూట్ లో వ్యాక్సిన్ల విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేస్తోన్న శారా.. ఆస్ట్రాజెనెకా టీకా తయారీలోనూ కీలక భూమిక పోషించారు.

First published:

Tags: Covid, India, Omicron, Omicron corona variant

ఉత్తమ కథలు