కరోనా కట్టడికి కొత్త చికిత్స.. ఇప్పుడిదే బెటర్ అంటున్న శాస్త్రవేత్తలు..

ఎయిమ్స్‌లో 30 మంది కరోనా పేషెంట్లపై చేపట్టిన ట్రయల్స్‌లో ప్లాస్మా థెరపీ ద్వారా మరణాల శాతాన్ని తగ్గించవచ్చనే స్పష్టత రాలేదని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. బుధవారం ఢిల్లీలో జరిగిన నేషనల్ క్లినికల్ గ్రాండ్ రౌండ్స్ సదస్సులో ప్లాస్మా థెరపీ అంశానికి సంబంధించి చర్చ జరిగింది. ఈ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Plasma Therapy : కరోనా కట్టడికి మందు లేదు.. వ్యాక్సిన్ అంతకన్నా లేదు.. ఉన్నదల్లా సామాజిక దూరం ఒక్కటే మార్గం. అయితే, శాస్త్రవేత్తలు కొత్త చికిత్సతో ముందుకు వచ్చారు.

  • Share this:
    కరోనా కట్టడికి మందు లేదు.. వ్యాక్సిన్ అంతకన్నా లేదు.. ఉన్నదల్లా సామాజిక దూరం ఒక్కటే మార్గం. అయితే, శాస్త్రవేత్తలు కొత్త చికిత్సతో ముందుకు వచ్చారు. దేశంలోనే తొలిసారి ప్లాస్మా థెరపీని ఉపయోగించారు ఢిల్లీలోని మ్యాక్స్ హాస్పిటల్ వైద్యులు. న్యూఢిల్లీలోని ఓ కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా సోకింది. వీరికి ఈ చికిత్సను అందజేస్తున్నారు. ఇదిలా ఉండగా, అమెరికాలోని హ్యూస్టన్‌లో ఉన్న సెయింట్‌ ల్యూక్స్‌ మెడికల్‌ సెంటర్‌లో తీవ్ర కరోనా ఇన్ఫెక్షన్‌తో చేరిన ముగ్గురు భారత అమెరికన్లకు కూడా ప్లాస్మా థెరపీ చేశారు. ఈ చికిత్స వల్ల వారి ముగ్గురికి సానుకూల ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం వారు ఇన్ఫెక్షన్‌ నుంచి కోలుకుంటున్నారని బేలర్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ డీన్‌ అశోక్‌ బాల సుబ్రమణ్యం వెల్లడించారు. మరో ఇద్దరు అమెరికన్లకు కూడా ఈ చికిత్స అందజేశారు.

    కరోనాకు మందు లేకపోవటంతో ప్రస్తుతం ప్లాస్మా థెరపీనే చేస్తున్నారు. ఈ విధానంలో కరోనా నుంచి కోలుకున్న పేషెంట్ రక్తం నుంచి ప్లాస్మా సేకరిస్తారు. అందులోని యాంటీ బాడీలను కరోనా పేషెంట్లకు ఎక్కిస్తారు. యాంటీ బాడీలో రక్తం లోకి వెళ్లి కరోనా వైరస్ తో ఫైట్ చేస్తాయి. ఐతే ప్లాస్మా థెరపీ లో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యే డోనర్స్ అవసరం ఉంటుంది.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: