హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Nasal Vaccine : గ్రేట్ న్యూస్..భారత్ బయోటెక్ నాజల్ వ్యాక్సిన్ వినియోగానికి DCGI గ్రీన్ సిగ్నల్

Nasal Vaccine : గ్రేట్ న్యూస్..భారత్ బయోటెక్ నాజల్ వ్యాక్సిన్ వినియోగానికి DCGI గ్రీన్ సిగ్నల్

ప్రతతీకాత్మక చిత్రం

ప్రతతీకాత్మక చిత్రం

DCGI Approves Bharat Biotech Nasal Covid Vaccine :  కరోనా వైరస్(Corona Virus) పై అలుపెరుగని భారతదేశం యొక్క పోరాటానికి మరింత ప్రోత్సాహం లభించింది. హైదరాబాద్ ప్రధానకేంద్రంగా కార్యకలాపాలు సాగించే భారత్‌ బయోటెక్‌ సంస్థ(Bharat Biotech)అభివృద్ధి చేసిన ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్‌ (Nasal Vaccine)అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ మండలి (DCGI) అనుమతి ఇచ్చింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

DCGI Approves Bharat Biotech Nasal Covid Vaccine :  కరోనా వైరస్(Corona Virus) పై అలుపెరుగని భారతదేశం యొక్క పోరాటానికి మరింత ప్రోత్సాహం లభించింది. హైదరాబాద్ ప్రధానకేంద్రంగా కార్యకలాపాలు సాగించే భారత్‌ బయోటెక్‌ సంస్థ(Bharat Biotech)అభివృద్ధి చేసిన ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్‌ (Nasal Vaccine)అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ మండలి (DCGI) అనుమతి ఇచ్చింది.18 ఏళ్లు దాటిన వారికి భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన చుక్కల మందు కొవిడ్​ టీకా (BBV154-నాసల్‌ వ్యాక్సిన్‌) అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమ‌తి ఇచ్చిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ మ‌న్సూక్ మాండ‌వీయ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఇప్పటికే దేశంలో కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ సహా పలు కోవిడ్ వ్యాక్సిన్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే దేశంలో ముక్కు ద్వారా అందుబాటులోకి వచ్చిన తొలి కొవిడ్​ వ్యాక్సిన్​ ఇదే. ఇండియాలో ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్ టీకాకు అనుమ‌తి ద‌క్క‌డం ఇదే తొలిసారి. కొవిడ్‌పై పోరులో నాసల్​ వ్యాక్సిన్​ ఒక బిగ్‌ బూస్ట్‌ అని మ‌న్సూక్ మాండ‌వీయ  ట్విట్టర్ లో తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొన్నామని ఆయన తెలిపారు.

Modi-Shiek Hasina : భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు ఓ రోల్ మోడల్..త్వరలోనే ఆ ఒప్పందం ఉంటుందన్న మోదీ


బీబీవీ154- అడెనోవైరస్‌ వెక్టార్డ్‌ ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్‌ (ముక్కు టీకా) కోసం కొన్ని నెలలుగా భారత్ బయోటెక్ కృషి చేసింది. అమెరికాలోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఇన్‌ సెయింట్‌ లూయీస్‌తోనూ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తయిన విషయం తెలిసిందే. ఈ టీకా క్లినికల్ ట్రయల్స్ ను 18 నుంచి 60 ఏళ్ళ మధ్య వయసు ఉన్న వారిపై నిర్వహించారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Bharat Biotech, COVID-19 vaccine

ఉత్తమ కథలు