కరోనాను ఖతం చేశారు.. ఢిల్లీ వైద్యుల ఘనత..

ఎయిమ్స్‌లో 30 మంది కరోనా పేషెంట్లపై చేపట్టిన ట్రయల్స్‌లో ప్లాస్మా థెరపీ ద్వారా మరణాల శాతాన్ని తగ్గించవచ్చనే స్పష్టత రాలేదని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. బుధవారం ఢిల్లీలో జరిగిన నేషనల్ క్లినికల్ గ్రాండ్ రౌండ్స్ సదస్సులో ప్లాస్మా థెరపీ అంశానికి సంబంధించి చర్చ జరిగింది. ఈ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశంలోనే తొలిసారి ఓ కరోనా పేషెంట్ ప్లాస్మా థెరపీతో పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. కరోనా లక్షణాలతో ఢిల్లీ సాకేత్‌ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన 49 ఏళ్ల బాధితుడికి చేసిన ప్లాస్మా థెరపీ చేశారు.

  • Share this:
    కరోనా కట్టడికి మందు లేదు.. వ్యాక్సిన్ అంతకన్నా లేదు.. ఉన్నదల్లా సామాజిక దూరం ఒక్కటే మార్గం. అయితే, శాస్త్రవేత్తలు కొత్త చికిత్సతో ముందుకు వచ్చారు. అదే ప్లాస్మా థెరపీ. ఆ థెరపీ ఇప్పుడు కరోనా అంతు చూసింది. దేశంలోనే తొలిసారి ఓ కరోనా పేషెంట్ ప్లాస్మా థెరపీతో పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. కరోనా లక్షణాలతో ఢిల్లీ సాకేత్‌ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన 49 ఏళ్ల బాధితుడికి చేసిన ప్లాస్మా థెరపీ చేశారు. ఆ థెరపీతో అతడు పూర్తిగా కోలుకున్నాడు. విషమంగా ఉన్న మరో ముగ్గురు రోగులకు కూడా ప్లాస్మా థెరపీ అందజేశారు. వారిలో ఒకరు ఇప్పుడు ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మారారు. మిగతా ఇద్దరిలోనూ శ్వాసకోశ సమస్యలు తీరిపోయాయి. ఇదిలా ఉండగా, అమెరికాలోని హ్యూస్టన్‌లో ఉన్న సెయింట్‌ ల్యూక్స్‌ మెడికల్‌ సెంటర్‌లో తీవ్ర కరోనా ఇన్ఫెక్షన్‌తో చేరిన ముగ్గురు భారత అమెరికన్లకు కూడా ప్లాస్మా థెరపీ చేశారు. ఈ చికిత్స వల్ల వారి ముగ్గురికి సానుకూల ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం వారు ఇన్ఫెక్షన్‌ నుంచి కోలుకుంటున్నారని బేలర్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ డీన్‌ అశోక్‌ బాల సుబ్రమణ్యం వెల్లడించారు. మరో ఇద్దరు అమెరికన్లకు కూడా ఈ చికిత్స అందజేశారు.

    కరోనాకు మందు లేకపోవటంతో ప్రస్తుతం ప్లాస్మా థెరపీనే చేస్తున్నారు. ఈ విధానంలో కరోనా నుంచి కోలుకున్న పేషెంట్ రక్తం నుంచి ప్లాస్మా సేకరిస్తారు. అందులోని యాంటీ బాడీలను కరోనా పేషెంట్లకు ఎక్కిస్తారు. యాంటీ బాడీలో రక్తం లోకి వెళ్లి కరోనా వైరస్ తో ఫైట్ చేస్తాయి. ఐతే ప్లాస్మా థెరపీ లో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యే డోనర్స్ అవసరం ఉంటుంది.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: