హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

International Flight Ban: ఫిబ్రవరి 28 దాకా అంతర్జాతీయ ప్రయాణాల్లేవు : నిషేధం పొడిగించిన భారత్

International Flight Ban: ఫిబ్రవరి 28 దాకా అంతర్జాతీయ ప్రయాణాల్లేవు : నిషేధం పొడిగించిన భారత్

అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఫిబ్రవరి 28 వరకు షెడ్యూల్డ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ప్యాసింజర్ విమాన సర్వీసులపై నిషేధం.

  ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తుండటం, ఒమిక్రాన్ సహా ఇతర వేరియంట్లు వేల మందిని బలితీసుకుంటోన్న నేపథ్యంలో కొవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఫిబ్రవరి 28 వరకు షెడ్యూల్డ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ప్యాసింజర్ విమాన సర్వీసులపై నిషేధం ఉంటుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బుధవారం తెలిపింది. గతేడాది చివర్లో ఒమిక్రాన్ వ్యాప్తి క్రమంలో భారత్ అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం ప్రకటించగా, ఇప్పుడు దానిని పొడిగించినట్లయింది.

  ఇంతకుముందు డిసెంబర్ లో డీజీసీఏ ప్రకటనను బట్టి జనవరి 31 వరకు అంతర్జాతీయ విమాన స్వీసులపై నిషేధం ఉండేది. ప్రస్తుతం ఇండియాలో కొవిడ్ మూడో వేవ్ ఉధృతంగా కొనసాగుతోన్న క్రమం, ప్రపంచ దేశాల్లోనూ ఇంకా అత్యవసర పరిస్థితులే నెలకొన్న నేపథ్యంలో విమాన సర్వీసుల నిషేధాన్ని గడువుకంటే ముందే పొడిగించారు. ఫిబ్రవరి 28 వరకు ప్యాసింజర్ విమానాల రాకపోకలు ఉండబోవని డీజీసీఏ పేర్కొంది. అయితే,

  UP Elections 2022: 'బికినీ గర్ల్‌'పై బీజేపీ గరంగరం.. కలిపి చూడొద్దన్న Archana Gautam

  సరుకులు రవాణా చేసే కార్గో విమానాలు, ఎయిర్‌ బబూల్‌ ఆరేంజ్‌మెంట్స్‌ విమానాలకు ఈ కొత్త నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుందని డీజీసీఏ ప్రకటనలో స్పష్టం చేశారు. కరోనా లాక్ డౌన్ల కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి రప్పించేందుకు భారత్ మిషన్ వందే తదితర సర్వీలను నడపడటం, 32 దేశాలతో ‘ఎయిర్‌ బబూల్‌’ ఒప్పందాల ద్వారా అత్యవసర సర్వీసులు నడుపుతోన్న సంగతి తెలిసిందే.

  First published:

  Tags: Airlines, Corona, Covid, DGCA, Flight, Omicron

  ఉత్తమ కథలు