INDIA EXPORT COVID 19 VACCINES TO BHUTAN BANGLADESH AND OTHER NEIGHBOURING NATIONS FROM TOMORROW SK
Covid-19 Vaccine: శభాష్ భారత్.. రేపటి నుంచే విదేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఎగుమతి
(ప్రతీకాత్మక చిత్రం)
కోవిషీల్డ్‌కు WHO గ్రీన్ సిగ్నల్ ఇస్తే చిన్న దేశాలు, పేద దేశాల నుంచి సీరం ఇన్‌స్టిట్యూట్‌కు ఆర్డర్స్ వెల్లువెత్తే అవకాశముంది. ఎందుకంటే ఫైజర్, మెడెర్నా వ్యాక్సిన్‌ల కన్నా కోవిషీల్డ్ చౌకయినది. అంతేకాదు ఈ రెండు వాక్సిన్‌లను చాలా తక్కువ ఉష్ణోగ్రతల్లో (మైనస్) నిల్వ చేయాల్సి ఉంటుంది. కానీ కోవిషీల్డ్‌ను 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేస్తే సరిపోతుంది.
మన దేశంలో ఇటీవలే కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమయింది. జనవరి 16 నుంచి అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ అందిస్తున్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు వంటి ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ వేస్తున్నారు. ఐతే కేవలం మన దేశ ప్రజలకు మాత్రమే కాదు.. విదేశాలకు కూడా వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తున్నారు. తమకు వ్యాక్సిన్ సరఫరా చేయాల్సిందిగా భారత్‌కు పలు దేశాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపటి నుంచే వ్యాక్సిన్ ఎగుమతికి శ్రీకారం చుట్టారు. ముందుగా చిన్న, ఇరుగుపొరుగు దేశాలకు మన మేడిన్ ఇండియా టీకాను ఎగుమతి చేయనున్నారు. బుధవారం నుంచి 6 దేశాలకు కోవిషీల్డ్ టీకాను సరఫరా చేయనున్నట్లు భారత విదేశాంగశాఖ మంగళవారం వెల్లడించింది.
'' వ్యాక్సిన్ సరఫరా చేయాల్సిందిగా ఎన్నో విజ్ఞప్తులు వస్తున్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని టీకా ఉత్పత్తిని, డెలివరీ సామర్థ్యాన్ని పెంచుతున్నాం. ముందుగా భూటాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, సీసెల్స్ దేశాలకు వ్యాక్సిన్ అందిస్తున్నాం. జనవరి 20 నుంచే ఈ ప్రక్రియ మొదలవుతుంది. శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, మారిషస్ దేశాల్లో వ్యాక్సిన్‌కు రెగ్యులేటరీ క్లియరెన్స్ రావాల్సి ఉంది. ఆమోదం లభించిన వెంటనే ఆ దేశాలకు కూడా వ్యాక్సిన్‌ను ఎగుమతి చేస్తాం.'' అని భారత విదేశాంగశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
India is deeply honoured to be a long-trusted partner in meeting the healthcare needs of the global community. Supplies of Covid vaccines to several countries will commence tomorrow, and more will follow in the days ahead. #VaccineMaitrihttps://t.co/9Czfkuk8h7
'' ప్రపంచదేశాలకు వైద్యపరమైన సాయం అందించడంలో భారత్ ఎప్పటి నుంచో నమ్మకమైన భాగస్వామిగా ఉంది. పలు దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ రేపటి నుంచి ప్రారంభమవుతుంది.'' అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రాయిటర్స్ వార్తా సంస్థ కథనం ప్రకారం మొదట భూటాన్‌కు వ్యాక్సిన్ పంపిస్తున్నారు. ఆ తర్వాత గురువారం బంగ్లాదేశ్‌కు 20 లక్షల డోస్‌ల సీరం ఇన్‌స్టిట్యూట్ వ్యాక్సిన్ కోవిషీల్డ్‌ను సరఫరా చేయనున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో కోవిషీల్డ్ టీకా వినియోగానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఆమోదం కోసం సీరం ఇన్‌స్టిట్యూట్ ఎదురుచూస్తోంది. కోవిషీల్డ్‌కు WHO గ్రీన్ సిగ్నల్ ఇస్తే చిన్న దేశాలు, పేద దేశాల నుంచి సీరం ఇన్‌స్టిట్యూట్‌కు ఆర్డర్స్ వెల్లువెత్తే అవకాశముంది. ఎందుకంటే ఫైజర్, మెడెర్నా వ్యాక్సిన్‌ల కన్నా కోవిషీల్డ్ చౌకయినది. అంతేకాదు ఈ రెండు వాక్సిన్‌లను చాలా తక్కువ ఉష్ణోగ్రతల్లో (మైనస్) నిల్వ చేయాల్సి ఉంటుంది. కానీ కోవిషీల్డ్‌ను 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేస్తే సరిపోతుంది. ఇప్పటికే బ్రెజిల్ నుంచి SIIకి ఆర్డర్ వచ్చింది. త్వరలోనే బ్రెజిల్‌కు టీకాలను ఎగుమతి చేయనుంది సీరం ఇన్‌స్టిట్యూట్. మరికొన్ని రోజుల్లో హైదరాబాద్‌లో తయారైన కోవాగ్జిన్ టీకాలను కూడా విదేశాలకు ఎగుమతి చేయాలని భారత ప్రభుత్వం భావిస్తోంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.