Pranab Mukherjee: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా

Pranab Mukherjee: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా

ప్రణబ్ ముఖర్జీ(ఫైల్ ఫోటో)

Pranab Mukherjee: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

 • Share this:
  దేశంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తోంది. సామాన్యూలతో పాటు అనేక మంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మాజీ రాష్ట్రప్రతి ప్రణబ్ ముఖర్జీ కూడా చేరిపోయారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తాను వేరే కారణాల వల్ల ఆస్పత్రికి వెళితే.. కోవిడ్ 19 పాజిటివ్ అనే విషయం నిర్థారణ అయ్యిందని ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. తనను గత వారం రోజులుగా కలిసిన వారంతా సెల్ఫ్ ఐసోలేషన్ పాటించి.. కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.  ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సైతం కరోనా సోకింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరోనా బారిన పడ్డారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం కోవిడ్ 19 సోకడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని వైరస్ నుంచి బయటపడ్డారు. కోవిడ్ 19 సోకడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు కర్ణాటక సీఎం యడియూరప్ప.

  భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 62064 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2215074కి చేరింది. అలాగే... గత 24 గంటల్లో 1007 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 44386కి చేరింది. దేశంలో 24 గంటల్లో 1000కి పైగా మరణాలు సంభవించడం ఆందోళన కలిగించే అంశమే. ఐతే... ప్రపంచ దేశాల్లో మరణాల రేటు... 3.67గా ఉండగా... ఇండియాలో అది 2 శాతంగానే ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం. గత 24 గంటల్లో ఇండియాలో 54859 మంది రికవరీ అయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 1535743కి చేరింది. రికవరీ రేటు 69.3కి చేరింది. ఇది కూడా దేశంలో రోజురోజుకూ పెరుగుతోంది. అందువల్ల ఇండియా కరోనాను సమర్థంగానే ఎదుర్కోగలుగుతున్నట్లు ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 634945 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
  Published by:Kishore Akkaladevi
  First published: