పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ చెత్త వ్యాఖ్యలు...భారత్‌లో ముస్లింలపై వివక్ష అంటూ...

కరోనాను కంట్రోల్ చేసే విషయంలో భారత్ విఫలమైందని, మతప్రాతిపదికగా ఓ వర్గం ప్రజలపై వివక్ష చూపుతోందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నోరు పారేసుకున్నాడు. భారత ప్రభుత్వంపై విషం కక్కాడు.

news18-telugu
Updated: April 20, 2020, 6:17 PM IST
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ చెత్త వ్యాఖ్యలు...భారత్‌లో ముస్లింలపై వివక్ష అంటూ...
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు తయారైంది పాకిస్థాన్ పరిస్థితి. కరోనాపై చేతులు ఎత్తేసి, ప్రపంచం ముందు బిక్షగాడిగా మారిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఇప్పుడు భారత్ పై విషం కక్కే ప్రయత్నం చేస్తున్నాడు. కరోనాను కంట్రోల్ చేసే విషయంలో భారత్ విఫలమైందని, మతప్రాతిపదికగా ఓ వర్గం ప్రజలపై వివక్ష చూపుతోందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నోరు పారేసుకున్నాడు. భారత ప్రభుత్వంపై విషం కక్కాడు. అయితే ఇమ్రాన్ ఖాన్ కు వంత పాడుతూ ఇస్లామిక్ దేశాలు కూడా అతని గలీజును అద్దెకు తీసుకుని భారత్ పై వేలెత్తి చూపాయి. కరోనా విధానం విఫలం కావడంతో భారత ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోడానికి ఉద్దేశపూర్వకంగా ఓ వర్గం ప్రజలను టార్గెట్ చేసిందని, మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆధిపత్య భావజాలానికి ఇది మరో నిదర్శనం’ అని ఇమ్రాన్ ట్వీట్ చేశాడు. కాసేపటి తర్వాత ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్ కూడా విషం చల్లాయి.

భారత్ లో ఓ మతానికి చెందిన ప్రజలపై విష ప్రచారం పెరిగిపోయిందని, కరోనా విషయంలో వారిపై దుష్ర్పచారం సాగుతోందని చెప్పుకొచ్చింది. ఈ ఆరోపణలను భారత్ దీటుగా తిప్పికొట్టింది. ఇమ్రాన్‌వి దిగజారుడు వ్యాఖ్యలని భారత ప్రభుత్వం గట్టిగా ఖండించింది. పాక్‌లో కరోనా రోగులకు కనీస వైద్య సదుపాయాలు లేవని, దాన్నుంచి ప్రజల దృష్టిని పక్కకు మళ్లించడానికి ఎప్పట్లాగే తమపై బురద జల్లారని మండిపడింది.
Published by: Krishna Adithya
First published: April 20, 2020, 6:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading