దేశంలో 4.5 లక్షలు దాటిన కరోనా కేసులు... ఒక్కరోజే 465 మరణాలు...

ఇండియాలో కరోనా జోరు కొనసాగుతోంది. మరో 15వేల మందికి పైగా ఆ వైరస్ బారిన పడ్డారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన టైమ్ ఇది.

news18-telugu
Updated: June 24, 2020, 9:46 AM IST
దేశంలో 4.5 లక్షలు దాటిన కరోనా కేసులు... ఒక్కరోజే 465 మరణాలు...
దేశంలో 4.5 లక్షలు దాటిన కరోనా కేసులు... ఒక్కరోజే 465 మరణాలు...
  • Share this:
ఇంట్లోంచీ బయటకు వెళ్తున్నారా... ఇది వరకటి కంటే... మూడు రెట్లు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకండి. ఎందుకంటే... ప్రస్తుతం ఉన్న టైమ్‌లో కరోనా సోకితే... ట్రీట్‌మెంట్ చెయ్యడానికి కూడా ఆస్పత్రుల్లో ఖాళీలు లేవు. ఇళ్ల దగ్గర ట్రీట్‌మెంట్ చెప్పుకున్నంత ఈజీ కాదు. ఇదంతా కాదు... అసలు కరోనాయే మనకు సోకకూడదనే బలమైన పట్టుదలతో ఉండాల్సిన సమయం ఇది. ఎందుకంటే... ఇండియాలో కరోనా అనూహ్యంగా పెరుగుతోంది. మరో 15968 మందికి వైరస్ సోకడంతో... మొత్తం కేసుల సంఖ్య 456183కి పెరిగింది. అంతేకాదు... మరో 465 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 14476కి పెరిగింది. ఇక రికవరీలు తాజాగా 10495 ఉన్నాయి. మొత్తం రికవరీలు 258684కి పెరిగాయి. ఇది మంచి విషయం. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 183022గా నమోదయ్యాయి.

ఇండియాలో ఇప్పుడు రికవరీ రేటు 56.7గా ఉంది. ఇది మెల్లగా పెరుగుతోంది. ఎంత పెరిగితే అంత మనకే మంచిది. అలాగే దేశంలో కరోనా మరణాల రేటు 3.2గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇది 9 శాతంగా ఉంది. అంటే మన దేశంలో కొంత కంట్రోల్ ఉన్నట్లే. అలాగే... ప్రపంచంలో ఎక్కువ కరోనా కేసులు ఉన్న దేశాల్లో మన ఇండియా నాలుగో స్థానంలో ఉంది. ఇది మనకు చెడు వార్త. ఇలా కొన్ని పాజిటివ్, కొన్ని నెగెటివ్ అంశాలున్నాయి. ఏది ఏమైనా ఇండియాలో పరిస్థితి బాలేదన్నది నిజం కాబట్టి... ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.

ఇండియాలో మొదటిసారిగా ఒకే రోజులో 2 లక్షల మందికి పైగా టెస్టులు చేశారు. నిన్న ఒక్క రోజే 215195 మందికి శాంపిల్ టెస్టులు చెయ్యడంతో... పాజిటివ్ కేసులు కూడా ఎక్కువగానే తేలాయి. ఇండియాలో ప్రస్తుతం మొత్తం టెస్టుల సంఖ్య 7352911కి చేరింది. రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో... కింది టేబుల్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు.

దేశంలో కరోనా కేసుల వివరాలు


ప్రపంచంలో కరోనా కేసుల వివరాలు
First published: June 24, 2020, 9:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading