India Corona: భారత్‌లో 53 లక్షలు దాటిన కరోనా కేసులు.. కొత్తవి ఎన్నంటే..

గడిచిన 24 గంటల్లో మనదేశంలో 8,81,911 శాంపిల్స్ పరీక్షించారు. భారత్‌లో ఇప్పటి వరకు 6 కోట్ల 24 లక్షల 54,254 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది.

news18-telugu
Updated: September 19, 2020, 9:43 AM IST
India Corona: భారత్‌లో 53 లక్షలు దాటిన కరోనా కేసులు.. కొత్తవి ఎన్నంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారత్‌లో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతోంది. రికవరీలతో పాటు కొత్త కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 93,337 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో 1,247 మంది మరణించారు. నిన్న 95,880 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 53,08,014కి చేరింది. కరోనాను జయించి 42,08,431 మంది పూర్తిగా కోలుకున్నారు. వైరస్‌తో పోరాడుతూ 85,619 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మనదేశంలో 10,13,964 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.


టెస్ట్‌ల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో మనదేశంలో 8,81,911 శాంపిల్స్ పరీక్షించారు. భారత్‌లో ఇప్పటి వరకు 6 కోట్ల 24 లక్షల 54,254 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది. మనదేశంలో మహారాష్ట్రలోనే అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 11,67,496 మందికి కరోనా సోకగా.. 31,791 మంది మరణించారు. ఇక రెండో స్థానంలో ఏపీ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 6,09,558 కేసులు నమోదవగా.. 5,244 మంది చనిపోయారు. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్నాటక, యూపీ రాష్ట్రాలున్నాయి.

రాష్ట్రాల వారీగా కరోనా కేసుల వివరాలు:
Published by: Shiva Kumar Addula
First published: September 19, 2020, 9:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading