హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Covid Cases In India : దేశంలో కొత్త కరోనా కేసులు ఎన్నో తెలుసా..

Covid Cases In India : దేశంలో కొత్త కరోనా కేసులు ఎన్నో తెలుసా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

శుక్రవారంతో పోల్చితే కోవిడ్ కేసుల సంఖ్య 800కి పైగానే పెరిగింది. శుక్రవారం 1997 కరోనా వైరస్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Covid Update : రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని కరోనా వైరస్(Corona Virus)పట్టిపీడిస్తోంది. ఇప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగానే ఉంటున్న విషయం తెలిసిందే. అయితే భారత్(India) లో మాత్రం కరోనా కేసులు(Corona Cases)తగ్గిపోతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 2797 కరోనా వైరస్ కేసులు,24మరణాలు(Covid Deaths)నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. అయితే శుక్రవారంతో పోల్చితే కోవిడ్ కేసుల సంఖ్య 800కి పైగానే పెరిగింది. శుక్రవారం 1997 కరోనా వైరస్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజా కేసులు,మరణాలతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,46,09,257కు,మొత్తం మరణాల సంఖ్య 5,28,778కు చేరింది.డైలీ పాజిటివిటీ రేటు 1.05శాతంగా,వీక్లీ పాజిటివిటీ రేటు 1.30శాతంగా ఉంది.

దేశంలో గడిచిన 24 గంటల్లో 3884 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,40,51,228కు చేరుకుంది. రికవరీ రేటు 98.75శాతంగా ఉంది. శుక్రవారం దేశంలో 2,66,839మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా..ఇప్పటివరకు 89.67కోట్ల మందికి కోవిడ్ టెస్ట్ లు నిర్వహించారు.

Prices Hike : సామాన్యుడికి మరో షాక్..పెరిగిన CNG,PNG ధరలు

దేశంలో ప్రస్తుతం 29,251 యాక్టివ్‌ కోవిడ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో 0.O7 శాతం కేసులు యాక్టివ్‌ గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక,దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. దేశంలో శుక్రవారం 4,96,833మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 218.93 కోట్లకు చేరింది.

First published:

Tags: Corona, Corona casess, Corona deaths, COVID-19 cases, COVID-19 vaccine

ఉత్తమ కథలు