India Covid Cases: రెండున్నరేళ్ల క్రితం చైనాలో తొలిసారి వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్(Corona Virus)..ప్రపంచాన్ని ఇంకా పట్టిపీడిస్తూనే ఉంది. మనదేశంలో కూడా గత కొద్దిరోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లొ దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం మధ్య దేశవ్యాప్తంగా 21,880 కోవిడ్ కేసులు, 60 మరణాలు(Covid Deaths)నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో 21,219 మంది కోవిడ్ నుంచి కోలుకున్నట్లు ప్రకటించింది. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగాఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 4,38,47,065 కాగా మొత్తం మరణాల సంఖ్య 5,25,930గా ఉంది. కోలుకున్నవారి సంఖ్య 4,31,71,653కాగా,దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 1,49,482గా ఉంది.
రోజువారీ పాజిటివిటీ రేటు 4.25 శాతానికి పెరిగింది. మొత్తం కేసుల్లో 0.34 కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.46 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో గురువారం 37,06,997 మందికి కోవిడ్ వ్యాక్సిన్ ని అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 201.30 కోట్లు దాటింది.
Amith Shah : రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది విజయం యావత్ దేశానికే గర్వకారణం
మరోవైపు,అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) కరోనా బారిన పడ్డారు. జో బైడెన్ కు స్వల్పంగా కోవిడ్ 19 పాజిటివ్(Covid 19 Positive) లక్షణాలు ఉన్నట్లు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తో పాటు బూస్టర్ డోస్‌ను కూడా బైడెన్ తీసుకున్నారు. అయినా అయన కరోనా బారిన పడటం గమనార్హం. ప్రస్తుతం ఆయన వైట్‌హౌస్‌లోనే ఐసోలేషన్ లో ఉన్నారని, అక్కడి నుంచే ఆన్లైన్ ద్వారా సమావేశాల్లో పాల్గొంటారని, ఆదేశాలిస్తారని వైట్ హౌస్ తెలిపింది. బైడెన్ ప్రస్తుతం యాంటీవైరల్ డ్రగ్ తీసుకుంటున్నారని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona deaths, Covid cases, Covid positive