భారత్‌లో 8.5 లక్షలకు చేరువలో కరోనా కేసులు... కొత్తగా ఎన్నంటే...

ఇండియాలో కరోనా కేసులు... రోజురోజుకూ మరింత ఎక్కువగా నమోదవుతున్నాయి. పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోతున్నాయి.

news18-telugu
Updated: July 12, 2020, 10:44 AM IST
భారత్‌లో 8.5 లక్షలకు చేరువలో కరోనా కేసులు... కొత్తగా ఎన్నంటే...
భారత్‌లో 8.5 లక్షలకు చేరువలో కరోనా కేసులు... (credit - NIAID)
  • Share this:
ఇండియాలో శుక్రవారం 27114 పాజిటివ్ కేసులు నమోదవ్వగా... శనివారం అంతకుమింది... 28637 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య... 820916 నుంచి పెరిగి... 849553కి చేరింది. ఇప్పుడు భారత్‌లో ప్రతి నాలుగు రోజులకు ఓసారి లక్ష కేసులు అదనంగా వచ్చి చేరుతున్నాయి. మూడ్రోజులుగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటోది. మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. తాజాగా 551 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 22674కి చేరింది. అలాగే... నిన్న 19235 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అవ్వడంతో... మొత్తం రికవరీల సంఖ్య 534621కి చేరింది. అదే సమయంలో... యాక్టివ్ కేసులు మరో 8851 పెరిగి... 292258కి చేరాయి.

ప్రస్తుతం మహారాష్ట్రలో అత్యధికంగా... 246600 పాజిటివ్ కేసులు ఉండగా... తమిళనాడులో 134226, ఢిల్లీలో 110921, గుజరాత్‌లో 40941, కర్ణాటకలో 36216, ఉత్తరప్రదేశ్‌లో 35092 కేసులున్నాయి. తెలంగాణలో 33402, బెంగాల్‌లో 28453, ఆంధ్రప్రదేశ్‌లో 27235 కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ 9 రాష్ట్రాల్లో కరోనా చాలా ఎక్కువగా ఉంది. వీటిని ఎక్కువగా కంట్రోల్ చెయ్యడం ద్వారా కరోనాను అదుపు చేయవచ్చని కేంద్రం భావిస్తోంది.



ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 62 శాతం ఉండటం మనకు కాస్త కలిసొచ్చే అంశం. ఢిల్లీలో ఇది 70 శాతానికి పైగా ఉంది. అందువల్ల పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నా... కేజ్రీవాల్ ప్రభుత్వం... ఒకింత ధైర్యంతో ఉంది. ప్రస్తుతం ప్రపంచ మొత్తం కేసుల్లో ఇండియా మూడో స్థానంలో ఉండగా... రోజువారీ కేసుల్లో కూడా మూడో స్థానంలోనే ఉంది. మొత్తం మరణాల్లో భారత్... ఎనిమిదో స్థానంలో ఉండగా... రోజువారీ మరణాల్లో బ్రెజిల్, అమెరికా, మెక్సికో తర్వాత... నాలుగో స్థానంలో ఉంది.
దేశంలో కరోనా కేసుల వివరాలు


ప్రపంచంలో కరోనా కేసుల వివరాలు
Published by: Krishna Kumar N
First published: July 12, 2020, 10:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading