news18-telugu
Updated: July 13, 2020, 9:40 AM IST
ఇండియాలో 3 లక్షల దాటిన కరోనా యాక్టివ్ కేసులు... కొత్తగా ఎన్నంటే...(credit - NIAID)
ఇండియాలో తాజాగా... 28701 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో... మొత్తం కేసుల సంఖ్య 878254కి చేరింది. అలాగే... నిన్న ఒక్క రోజే 500 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 23174కి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటు 7 శాతంగా ఉండగా... ఇండియాలో అది 2.6 శాతంగా ఉండటం మనకు కాస్త ఊరట కలిగించే అంశం. ఇక నిన్న ఒక్క రోజే... 18850 మంది రికవరీ అయ్యారు. ఫలితంగా మొత్తం రికవరీ కేసుల సంఖ్య 553470కి పెరిగింది. అందువల్ల దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 63 శాతంగా ఉంది. ఇది మనకు ఉపశమనం కలిగించే అంశం. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 301609 ఉన్నాయి. తొలిసారిగా యాక్టివ్ కేసులు 3 లక్షలు దాటాయి.
ప్రస్తుతం మొత్తం కేసుల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. రోజువారీ నమోదవుతున్న కేసుల్లో అమెరికా తర్వాత... ఇండియా చేరింది. మొత్తం మరణాల్లో భారత్ 8వ స్థానంలో ఉండగా... రోజువారీ నమోదవుతున్న మరణాల్లో బ్రెజిల్, మెక్సికో తర్వాత భారత్ ఉంది. ఇండియా తర్వాత అమెరికా ఉంది. దీన్ని బట్టీ మనకు తెలిసేది ఒకటే. ఇండియాలో కరోనా రోజురోజుకూ పెరుగుతోంది. కొత్త కేసులు, మరణాలూ పెరుగుతున్నాయి.

దేశంలో కరోనా కేసుల వివరాలు

దేశంలో కరోనా కేసుల వివరాలు
Published by:
Krishna Kumar N
First published:
July 13, 2020, 9:35 AM IST