కరోనా ఉగ్ర రూపం.. ఇండియాలో లక్ష దాటిన పాజిటివ్ కేసులు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుంటే ఇండియాలో మాత్రం కుప్పలు తెప్పలుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.

 • Share this:
  ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుంటే ఇండియాలో మాత్రం కుప్పలు తెప్పలుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మొన్నటి నుంచి నిన్నటి వరకు (కేవలం 24 గంటల్లోనే) 5వేలకు పైచిలుకు కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం.. కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. మొత్తం 1,01,139 కేసులు నమోదయ్యాయి. అందులో 3,163 మంది చనిపోయారు. కరోనా కేసుల్లో ప్రపంచంలోనే 11 వ స్థానానికి చేరింది ఇండియా. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 58,802 ఉండగా.. 39,174 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రాల వారీగా చూస్తే.. మహారాష్ట్రలో అత్యధికంగా 35,058 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
  దేశవ్యాప్తంగా కరోనా వివరాలు


  తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో నిన్న 41 కేసులు నమోదయ్యాయి. సోమవారం 10 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. ఎవరూ చనిపోలేదు. కొత్తగా GHMC పరిధిలో 26, మేడ్చల్‌లో 3, మరో 12 మంది వలస కార్మికులకు కరోనా సోకింది. తాజా లెక్కలతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,592కి చేరింది. వీరిలో 1,002 మంది కోలుకోగా.. 34 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 556 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. ఏపీలో నిన్నటికి మొత్తం కరోనా కేసుల సంఖ్య 2282కి చేరింది. 1527 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మృతుల సంఖ్య 50గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 705గా ఉంది.
  11వ స్థానంలో భారత్
  Published by:Shravan Kumar Bommakanti
  First published: