హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

భారత్‌కు అమెరికా సాయం.. ఏకంగా రూ.741 కోట్లు.. భారీగా మందులు, వైద్య పరికరాలు

భారత్‌కు అమెరికా సాయం.. ఏకంగా రూ.741 కోట్లు.. భారీగా మందులు, వైద్య పరికరాలు

జో బైడెన్, నరేంద్ర మోదీ

జో బైడెన్, నరేంద్ర మోదీ

భారత్‌లో అమెరికా పంపించే పరికరాల్లో.. వెయ్యి ఆక్సిజన్‌ సిలిండర్లు, 9,60,000 ర్యాపిడ్ యాంటి జెన్ టెస్ట్‌ కిట్లు, కోటి 50 లక్షల మిలియన్ల ఎన్‌-95 మాస్కులు, 10 లక్షల ర్యాపిడ్‌ కిట్లు ఉన్నాయి.

కరోనా విలయతాండవంతో వణికిపోతున్న భారత్‌కు అమెరికా ఆపన్నహస్తం అందించింది. కరోనాతో జరుగున్న పోరాటంలో ఇండియాకు అండగా ఉంటామని ప్రకటించింది. పెద్ద ఎత్తున మందులు, వైద్య పరికరాలను పంపిస్తోంది. భారత్‌కు వంద మిలియన్‌ డాలర్ల (రూ.741 కోట్లు) విలువైన వైద్య సామగ్రిని సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం వైట్ హౌస్ ఒక ప్రకటన చేసింది. ఇండియాకు వైద్య సామగ్రి సరఫరా చేసేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలను అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్‌ ట్విటర్ ద్వారా వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కు సాయం చేసేందుకు అమెరికా కట్టుబడి ఉందని.. డాక్టర్లు, వైద్య సిబ్బందిని కాపాడేందుకునేందుకు శక్తిమేరకు సాయం చేస్తామని తెలిపింది. కరోనా చికిత్సకు ఉపయోగించే అత్యవసర పరికరాలు గురువారం భారత్‌కు బయలుదేరుతాయని పేర్కొంది.

భారత్‌లో అమెరికా పంపించే పరికరాల్లో.. వెయ్యి ఆక్సిజన్‌ సిలిండర్లు, 9,60,000 ర్యాపిడ్ యాంటి జెన్ టెస్ట్‌ కిట్లు, కోటి 50 లక్షల మిలియన్ల ఎన్‌-95 మాస్కులు, 10 లక్షల ర్యాపిడ్‌ కిట్లు ఉన్నాయి. ఇక 2 కోట్ల కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడి సరుకును కూడా పంపిస్తున్నారు. త్వరలోనే వెయ్యి ఆక్సీజన్ కాన్సెంట్రేటర్లను కూడా తరలించనుంది. అంతేకాదు కరోనాపై జరుగుతున్న పోరాటానికి.. యూఎస్‌ ఎయిడ్‌ కింద 23 మిలియన్‌ డాలర్లు( రూ.170 కోట్లు) సాయం అందిస్తోంది అమెరికా. ఈ సామాగ్రితో ప్రపంచంలోనే అతి పెద్ద మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్ ట్రావిస్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరుతుంది.


మనదేశంలో గడిచిన 24 గంటల్లో 3,79,257 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 2,69,507 మంది కోలుకోగా.. మరణాలు కూడా భారీగా నమోదయ్యాయి. ఏకంగా 3645 మంది మరణించారు. తాజా లెక్కలతో భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 1,83,76,524కి చేరింది. వీరిలో 1,50,86,878 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 2,04,832 మంది మరణించారు. ప్రస్తుతం మనదేశంలో 30,84,814 యాక్టివ్ కేసులున్నాయి. మహారాష్ట్రలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 63,309 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. కర్నాటకలో 39,047, కేరళలో 35,013, యూపీలో 29,751, ఢిల్లీలో 25,986 మందికి పాజిటివ్ వచ్చింది.

First published:

Tags: America, Joe Biden, Narendra modi, Us news

ఉత్తమ కథలు