హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

ఆక్సిజన్ పంపిణీకి నేషనల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేసిన సుప్రీంకోర్టు.. ఇది ఏం చేస్తుందంటే..

ఆక్సిజన్ పంపిణీకి నేషనల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేసిన సుప్రీంకోర్టు.. ఇది ఏం చేస్తుందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు శాస్త్రీయంగా, హేతుబ‌ద్ధంగా, స‌మానంగా ఆక్సిజ‌న్ సరఫరా అయ్యేలా నేషనల్ టాస్క్‌ఫోర్స్ చూస్తుంది. అంతేకాదు కొవిడ్ చికిత్స‌కు అవ‌స‌ర‌మైన మందులను సమానంగా పంచాల్సిన బాధ్యతను కూడా నిర్వర్తిస్తుంది.

ఇంకా చదవండి ...

  కరోనా కోరల్లో చిక్కుకొని భారత్ విలవిల్లాడుతోంది. ప్రపంచంలో మరెక్కడా ఇంత దారుణ పరిస్థితులు లేవు.  సెకండ్ వేవ్‌లో చాలా మంది ఊపిరాడక చనిపోతున్నారు. సకాలలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా కేంద్రం ఎన్నో చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వస్తున్నాయి. ఐనప్పటికీ సమస్య పరిష్కారం కావడం లేదు. సరిపడా ఆక్సిజన్ పంపించడం లేదని పలు రాష్ట్రాలు కేంద్రంపై మండిపడుతున్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా కోసం నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఇందులో 12 మంది సభ్యులుంటారు.

  రాష్ట్రాల‌కు కేంద్రం పంపిణీ చేస్తున్న ఆక్సిజ‌న్ కేటాయింపుల‌ను పునఃస‌మీక్షించాల‌ని సూచిస్తూ సుప్రీంకోర్టు ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. నేషనల్ టాస్క్‌ఫోర్స్‌కు పశ్చిమ బెంగాల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మాజీ వీసీ డాక్ట‌ర్ భ‌బ‌తోష్ బిశ్వాస్ నేతృత్వం వ‌హించ‌నున్నారు. గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌ అండ్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఎండీ డాక్టర్‌ నరేశ్‌ ట్రెహాన్‌, ఢిల్లీలోని గంగారామ్‌ హాస్పిటల్, తమిళనాడు రాయవెల్లూర్ క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ, బెంగళూరులోని నారాయణ హెల్త్‌కేర్‌, ముంబయిలోని ఫోర్టిస్‌ ఆసుపత్రుల్లోని ప్రముఖ డాక్టర్లు ఇందులో సభ్యులుగా ఉంటారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు శాస్త్రీయంగా, హేతుబ‌ద్ధంగా, స‌మానంగా ఆక్సిజ‌న్ సరఫరా అయ్యేలా నేషనల్ టాస్క్‌ఫోర్స్ చూస్తుంది. అంతేకాదు కొవిడ్ చికిత్స‌కు అవ‌స‌ర‌మైన మందులను సమానంగా పంచాల్సిన బాధ్యతను కూడా నిర్వర్తిస్తుంది. కరోనా వ్యాధి, కోవిడ్ వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో ఉన్న అపోహలు, అనుమానాలను కూడా నివృత్తి చేస్తుంది.

  రాష్ట్రలకు కేంద్రం ఆక్సిజన్ పంపిణీ చేస్తున్న తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆక్సిజన్ కేటాయింపు నేపథ్యంలో అంబులెన్స్‌లు, కింది స్థాయి ఆరోగ్య కేంద్రాలు, హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా రోగులు వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకోలేదని కోర్టు అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే నేషనల్ టాస్క్ ఫోర్స్‌‌ను ఏర్పాటు చేసి.. ఆక్సిజన్ పంపిణీ బాధ్యతను దానికి అప్పగించింది.

  మరోవైపు మనదేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం దేశవ్యాప్తంగా కొత్తగా 4,01,078 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2,18,92,676కి చేరింది. కొత్తగా 4,187 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 2,38,270కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.1 శాతంగా ఉంది. తాజాగా 3,18,609 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1,79,30,960కి చేరింది. రికవరీ రేటు 81.9 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్‌లో 37,23,446 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Coronavirus, Covid-19, Oxygen, Oxygen machine, Supreme Court

  ఉత్తమ కథలు