Niagara Falls: మువ్వన్నెల నయాగరా జలపాతం.. భారత్‌కు సంఘీభావం

త్రివర్ణంలో నయాగరా ఫాల్స్

Niagara Falls: నయాగరా జలపాతంపై భారత త్రివర్ణ రంగులను ప్రదర్శించడం ఇది మొదటిసారేమీ కాదు. గత ఏడాది ఆగస్టు 15న జరుపుకున్న 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కెనడా ప్రభుత్వం ఇలాగే నయాగరా ఫాల్స్​పై భారత త్రివర్ణ పతాక రంగులను ప్రదర్శించింది.

  • Share this:
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్​లో కరోనా సెకండ్​ వేవ్ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా రోజు రోజుకూ పాజిటివ్​ కేసులు, మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజుకు నాలుగు లక్షల కేసులు, మూడు వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితి నుంచి భారత్​ గట్టెక్కడానికి అన్ని దేశాలు తమ వంతు సాయం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా తమ వంతుగా 100 మిలియన్​ డాలర్ల సాయం చేస్తున్నట్లు ప్రకటించింది. భారీగా మందులు, వైద్య పరికరాలను భారత్​కు పంపించింది. ఇక అమెరికాతో సహా ఆస్ట్రేలియా, కెనడా, దుబాయ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్​​ వంటి దేశాలు సైతం భారత్​కు అండగా నిలుస్తున్నాయి. ఇదే తరహాలో, కరోనాపై పోరులో భారత్​కు సంఘీభావంగా కెనడా ప్రభుత్వం వినూత్న ప్రదర్శన చేసింది. న్యూయార్క్​–కెనడా నగరాల మధ్య గల ప్రసిద్ధ నయాగరా జలపాతంపై ఏప్రిల్ 28న రాత్రి 9.30 నుంచి 10 గంటల వరకు త్రివర్ణ రంగులను ప్రదర్శించింది. ఈ క్రమంలో ప్రపంచంలోని సహజ అద్భుతాలలో ఒకటిగా పేరొందిన నయాగరా జలపాతం ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో వెలిగిపోయింది.

కోవిడ్​ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న భారత్​కు సంఘీభావంగా అరగంట పాటు నయాగరా వాటర్​ ఫాల్స్​పై మూడు రంగులను ప్రదర్శించినట్లు నయగరా పార్క్స్​ ట్వీట్ చేసింది. #StayStrongIndia అనే హ్యాష్‌ట్యాగ్‌తో​ జతచేసి త్రివర్ణాల్లో వెలుగుతున్న నయాగరా జలపాతం ఫోటోలను, వీడియోలను పోస్ట్​ చేసింది.


ఈ పోస్ట్​ ఇంటర్నెట్‌లో క్షణాల్లోనే వైరల్​గా మారిపోయింది. ఇండియాకు మద్దతుగా నిలిచినందుకు ఎంతో మంది ట్విట్లర్​లో కెనడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అయితే నయాగరా జలపాతంపై భారత త్రివర్ణ రంగులను ప్రదర్శించడం ఇది మొదటిసారేమీ కాదు. గత ఏడాది ఆగస్టు 15న జరుపుకున్న 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కెనడా ప్రభుత్వం ఇలాగే నయాగరా ఫాల్స్​పై భారత త్రివర్ణ పతాక రంగులను ప్రదర్శించింది. ఇక కరోనాపై పోరులో భారత్​కు మద్ధతుగా దుబాయ్​ సైతం నిలుస్తోంది. ప్రపంచంలోనే ఎత్తైన భవనాల్లోగా పేరొందిన బుర్జ్ ఖలీఫా, అబుదాబిలోని యస్​ ఐల్యాండ్​లపై కూడా ఇలా త్రివర్ణాలను ప్రదర్శించి దుబాయ్ భారత్​కు సంఘీభావం తెలిపిన విషయం తెలిసిందే.
Published by:Shiva Kumar Addula
First published: