ఇండియాను కరోనా థర్డ్ వేవ్ (India Corona Third Wave) వణికిస్తోంది. కేసుల సంఖ్య భయంకరంగా పెరుగుతోంది. క్రిస్మస్ (Christmas) సమయంలో 6వేలుగా ఉన్న రోజువారీ కరోనా కేసుల సంఖ్య ఇప్పుడు లక్ష దాటింది. యాక్టివ్ కేసులు కూడా బాగా పెరిగాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసులు (Omicron Cases) సైతం విపరీతంగా పెరుగుతున్నాయి. మన దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఇప్పటికే 3 వేలు దాటింది. సెకండ్ వేవ్‌లో డెల్టా వేరియెంట్ (Delta Variant) అల్లకల్లోలం సృష్టించింది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మరి డెల్టా, ఒమిక్రాన్‌లో ఏది డేంజర్? డెల్టాతో పోల్చితే ఒమిక్రాన్ ప్రాణాంతకం కాదా? నిపుణులు ఏమంటున్నారు. అసలు ఈ రెండు వేరియంట్లలో తేడాలేంటి?
డెల్టాతో పోల్చితే ఒమిక్రాన్ తీవ్రత తక్కువేనని వైద్య నిపుణులు మొదటి నుంచీ చెబుతున్నారు. ఒమిక్రాన్ గొంతులో వృద్ధి చెందుతుంది. అంతేతప్ప ఊపిరితిత్తులపై ప్రభావం చూపడం లేదు. కానీ డెల్టా వేరియెంట్ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపడంతో ఎంతో మంది ఊపిరాడక కన్నుమూశారు. ఒమిక్రాన్ సోకిన రోగులకు శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ డెల్టా వేరియెంట్ బాధితులు శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొన్నారు. అందుకే కోడ్ సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్‌కు డిమాండ్ (Oxygen demand) అకస్మాత్తుగా పెరిగింది.
Omicron: కరోనా విజృంభణ.. ఇలా చేయాలంటూ ఆ రాష్ట్రాలకు కేంద్రం లేఖ..
ఒమిక్రాన్ వేరియెంట్‌లో స్వల్ప లక్షణాలు (Omicron Symptoms) మాత్రమే ఉన్నాయి. కీళ్లనొప్పులు, అలసట, జలుబు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. చాలా మంది రోగులు తమకు గొంతు నొప్పిగా ఉందని చెప్పారు. హార్ట్ రేటు కూడా కొందరిలో ఎక్కువగా ఉంది. ఐతే రుచి, వాసన మాత్రం కోల్పోవడం వంటి కంప్లైంట్స్ ఇప్పటివరకైతే లేవు. ఇక డెల్టా వేరియెంట్ విషయానికొస్తే.. జ్వరం, జలుబు, దగ్గు, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కనిపించాయి. చాలా మంది రోగులు రుచి, వాసనను గుర్తించే స్వభావాన్ని కోల్పోయారు. ఇక ఒమిక్రాన్ సోకిన రోగుల్లో 99.5 నుంచి 100 F వరకు జ్వరం ఉండే అవకాశముంది. అదే సమయంలో డెల్టా రోగుల్లో 101 నుంచి 103 F వరకు జ్వరం కనిపించింది.
తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. మళ్లీ లాక్‌డౌన్?
ఒమిక్రాన్ కూడా వైరల్ ఇన్‌ఫెక్షనే (Viral Infections). కానీ అది ఊపిరితిత్తుల వరకూ వెళ్లకపోవడం వల్ల అంత తీవ్రమైనది కాదని డాక్టర్లు చెబుతున్నారు. కానీ డెల్టా కంటే వేగంగా సంక్రమించే సామర్థ్యం మాత్రం దీనికి ఉంది. తక్కువ సమయంలో ఎక్కువ కేసులు నమోదవడానికి ఇదే కారణం. ఐతే తాజా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. ఒమిక్రాన్ ప్రమాదకారి కాదని కొట్టిపారేయవద్దని... డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ పేర్కొన్నారు. ఒమిక్రాన్‌ను తేలిగ్గా తీసుకోవద్దని ఆయన అన్ని దేశాలను హెచ్చరించారు. మరణాలు కూడా ఎక్కువగానే వస్తున్నాయని.. అందుకే ప్రజలంతా కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు. ముఖ్యంగా టీకాలు వేసుకోని వారిపై ఎక్కువ ప్రభావం చూపుతోందని.. అందరూ టీకాలు వేసుకోవాలని చెప్పారు.
AP Corona: ఏపీలో థర్డ్ వేవ్ టెన్షన్.. మూడు రోజుల నుంచి పెరుగుతున్న కేసులు..
ఇవాళ్టి బులెటిన్ (India Covid Bulletin) ప్రకారం.. మన దేశంలో 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ విస్తరించింది. ఇప్పటి వరకు 3,007 కేసులు నమోదయ్యాయి. 876 కేసులతో మహారాష్ట్ర టాప్‌లో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ (465), కర్నాటక (333), రాజస్థాన్ (291), కేరళ (284), గుజరాత్ (204) రాష్ట్రాలున్నాయి. రానున్న రోజుల్లో ఒమిక్రాన్ వల్లే కరోనా వ్యాప్తి పెరిగే అకాశముందని.. ఈ నెలాఖరు నాటికి రోజు 4 లక్షల కరోనా కేసులు వచ్చే అవకాశముందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.