Home /News /coronavirus-latest-news /

INDIA CORONA UPDATES DELTA PLUS NOT A VARIANT OF CONCERN SAYS AIIMS DIRECTOR RANDEEP GULERIA GH SK

COVID-19: డెల్టా ప్లస్​ వేరియంట్​​ గురించి ఆందోళన వద్దు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

(ప్రతీకాత్మక చిత్రం - image credit - NIAID)

(ప్రతీకాత్మక చిత్రం - image credit - NIAID)

కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే డెల్టా ప్లస్ వేరియంట్​ వల్ల ప్రమాదం ఉండదని ఎయిమ్స్ డైరెక్టర్ స్పష్టం చేశారు. టీకా తీసుకున్నాక కరోనా సోకినా ప్రాణనష్టం ఉండదని చెప్పారు. అందుకే అందరూ కరోనా టీకా తీసుకోవాలని సూచించారు.

కరోనా వైరస్ రెండో వేవ్​లో డెల్టా, అల్ఫా వేరియంట్లు​ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ రకాల వల్ల వైరస్​ వేగంగా వ్యాపించడంతో పాటు కొంతమందిలో ప్రమాదకరంగానూ మారి ప్రాణాలు తీసింది. అయితే రెండో వేవ్ ఉద్ధృతి తగ్గుతున్న ప్రస్తుత తరుణంలో తాజాగా డెల్టా ప్లస్ వేరియంట్ బయటపడడంతో ఆందోళన నెలకొంది. మళ్లీ వైరస్ వ్యాప్తి పెరుగుతుందోమోనని భయం వ్యక్తమవుతుంది. అయితే డెల్టా ప్లస్ వేరియంట్​ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు ఎయిమ్స్​ డైరెక్టర్​ రణ్​​దీప్​ గులేరియా. సీఎన్​ఎన్​-న్యూస్ 18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి మరిన్ని వివరాలు వెల్లడించారు. అయితే వ్యాక్సిన్​ సమర్థతపై ఆ రకం వైరస్ ప్రభావం చూపించవచ్చని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. అయినా వ్యాక్సిన్ తీసుకుంటే ఈ వేరియంట్​ వల్ల ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు. టీకా తీసుకున్నాక కరోనా సోకినా ప్రాణనష్టం ఉండదన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడడం, తీవ్ర అనారోగ్యం బారిన పడకుండా చూడడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

కొవిషీల్డ్​వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధిని పెంచడంపైనా గులేరియా మాట్లాడారు. ఆలస్యంగా రెండో డోసు ఇస్తే రోగనిరోధక శక్తి మెరుగ్గా పెరుగుతుందని నేషనల్​ టెక్నికల్​ అడ్వైజరీ గ్రూప్​ ఆన్​ ఇమ్యూనిటీ (ఎన్​టీఏజీఐ) పరిశోధనల్లో తేలిందని ఆయన అన్నారు. భవిష్యత్తులో డోసుల మధ్య వ్యవధి మారే అవకాశం ఉందని, అయితే ప్రస్తుతమున్న విధానం చాలా పటిష్టమైనదని డేటా స్పష్టం చేస్తోందని గులేరియా చెప్పారు. “అల్ఫా వేరియంట్ గతంలో తీవ్ర ప్రభావం చూపినా ప్రస్తుతం తగ్గిపోయింది. ఇప్పుడు డెల్టా వేరియంట్ అంత కంటే బలంగా తయారైంది. ఈ రెండు వేరియంట్ల వ్యాప్తి తీవ్రంగా ఉంటుంది. వీటిపై అధ్యయానాలను నిశితంగా పరిశీలించాల్సి ఉంది. ఆ తర్వాత వ్యాక్సిన్​ డోసులపై ఓ నిర్ణయానికి వస్తాం” అని గులేరియా స్పష్టం చేశారు.

వైరస్​ నుంచి వ్యాక్సిన్లు కచ్చితంగా రక్షణ కల్పిస్తాయని ఎయిమ్స్ డైరెక్టర్ చెప్పారు. టీకాల ద్వారా ప్రాణనష్టం, తీవ్ర అనారోగ్యం తప్పుతుందని ఆయన చెప్పారు. అలాగే కరోనా వైరస్ న్యూ వేరియంట్​ డెల్టాప్లస్ గురించి గులేరియా వివరించారు. ఈ రకంపై ఇంకా విస్తృతమైన డేటా అందుబాటులోకి రాలేదన్నారు. “డెల్టా ప్లస్ వేరియంట్​పై దృష్టి సారించాం. దీని గురించి డేటా అంతగా లేదు. అయితే దీని వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని కానీ, ప్రాణాంతకమనే రుజువులు కానీ లేవు. ఇది ఎలా మారుతుందో చూడాలి. మొత్తంగా ప్రజలు ప్రాణాలు కాపాడడం, ఆసుపత్రి పాలుకాకుండా చూడడమే మా ప్రధాన లక్ష్యం. అందుకే వ్యాక్సిన్ వేసుకుంటే ఒకవేళ వైరస్ సోకినా పరిస్థితి ప్రమాదకరంగా మారదు” అని గులేరియా స్పష్టం చేశారు.

కరోనా సోకకుండా ప్రజలు తప్పకుండా మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరం లాంటి జాగ్రత్తలు పాటించాల్సిందేనని గులేరియా స్పష్టం చేశారు. అలాగే కొత్త వేరియంట్లపై కూడా సమర్థంగా పని చేసేలా వ్యాక్సిన్లలో మార్పులు చేయడంపై పరిశోధనలు వేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Corona Vaccine, Coronavirus, Covid-19, COVID-19 vaccine

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు