హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Coronavirus: భారత్‌కు బ్రిటన్ సాయం.. గాలి నుంచి ఆక్సిజన్ తీసే యంత్రాల తరలింపు

Coronavirus: భారత్‌కు బ్రిటన్ సాయం.. గాలి నుంచి ఆక్సిజన్ తీసే యంత్రాల తరలింపు

బ్రిటన్ ప్రధానితో భారత ప్రధాని

బ్రిటన్ ప్రధానితో భారత ప్రధాని

ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు గాలి నుంచి ఆక్సిజన్‌ను సేకరించి రోగులకు అందిస్తాయి. ఆస్పత్రి ప్రాంగణంలోనే వీటిని ఏర్పాటు చేసి ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగులకు నేరుగా అందించవచ్చు. తద్వారా ఎంతో మంది కరోనా రోగుల ప్రాణాలను కాపాడుకోవచ్చు.

కరోనాతో విలవిల్లాడుతున్న భారత్‌కు ప్రపంచ దేశాలు బాసటగా నిలుస్తున్నాయి. ఇండియాకు అండగా ఉంటామని ఇప్పటికే ఎన్నోదేశాలు ప్రకటించాయి. తాజాగా మనదేశానికి సాయం అందించేందుకు బ్రిటన్ మందుకొచ్చింది. కరోనా సెకండ్ వేవ్‌తో పోరాడుతున్న భారత్‌కు వైద్య పరికరాలను పంపనున్నట్లు బ్రిటన్ ప్రకటించింది. 600 వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ పంపించనున్నట్లు తెలిపింది. ఇందుకోసం మొదటి ప్యాకేజ్ మంగళవారం నాటికి ఢిల్లీకి చేరుకుంటుందని వెల్లడించింది. బ్రిటన్ ఫారిన్, కామన్‌వెల్త్ డెవలప్‌మెంట్ ఆఫీసు ద్వారా ఈ ప్యాకేజీ అందనుంది. విపత్కర సమయంలో ఎలాంటి సాయం చేసేందుకైనా సిద్ధమని ఆ దేశ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు.

'కోవిడ్-19పై జరుగుతున్న పోరాటంలోమా మిత్ర దేశం, భాగస్వామి అయిన ఇండియాకు మావంతు సాయం చేస్తాం. ఈ కష్ట సమయంలో భారత ప్రభుత్వంతో పనిచేయడాన్ని కొనసాగిస్తాం.'' అని బోరిస్ జాన్సన్ అన్నారు.


మొత్తం 9 ఎయిర్‌లైన్ కంటెయినర్లలో 495 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్, 120 నాన్ ఇన్వేసివ్ వెంటిలేటర్లు, 20 మాన్యువల్ వెంటిలేటర్లను పంపిస్తోంది బ్రిటన్ ప్రభుత్వం. యూకే పంపిస్తున్న ఈ వైద్య పరికరాలు కరోనాపై భారత్ చేస్తున్న పోరాటంలో కీలక భూమిక పోషించనున్నాయి. ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు.. గాలి నుంచి ఆక్సిజన్‌ను సేకరించి రోగులకు అందిస్తాయి. ఆస్పత్రి ప్రాంగణంలోనే వీటిని ఏర్పాటు చేసి ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగులకు నేరుగా అందించవచ్చు. తద్వారా ఎంతో మంది కరోనా రోగుల ప్రాణాలను కాపాడుకోవచ్చు.

ఇండియాలో బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎలిస్ మాట్లాడుతూ..కరోనా కష్టకాలంలో భారత్‌కు అండగా నిలుస్తామని తెలిపారు. అందరం కలిసి కట్టుగా పోరాడి విజయం సాధిస్తామని పేర్కొన్నారు.

భారత్‌లో శనివారం 3,49,691 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారన అయింది. మొత్తం కేసుల సంఖ్య 1,69,60,172కి చేరింది. మొన్న 2,624 మంది చనిపోగా... నిన్న 2,767 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,92,311కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.1 శాతంగా ఉంది. తాజాగా 2,17,113 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1,40,85,110కి చేరింది. ప్రస్తుతం భారత్‌లో 26,82,751 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 17,19,588 మందికి కరోనా పరీక్షలు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 27 కోట్ల 79లక్షల 18వేల 810 టెస్ట్‌లు చేశారు. కొత్తగా 25,36,612 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 14కోట్ల 09లక్షల 16వేల 417 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

First published:

Tags: Coronavirus, Covid-19, Oxygen, Oxygen machine, United Kingdom

ఉత్తమ కథలు