India corona: 90వేలు దాటిన కరోనా మరణాలు.. తగ్గుతున్న కొత్త కేసులు

గడిచిన 24 గంటల్లో మనదేశంలో 9,53,683 శాంపిల్స్ పరీక్షించారు. భారత్‌లో ఇప్పటి వరకు 6 కోట్ల 62 లక్షల 79,462 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది.

news18-telugu
Updated: September 24, 2020, 9:37 AM IST
India corona: 90వేలు దాటిన కరోనా మరణాలు.. తగ్గుతున్న కొత్త కేసులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారత్‌లో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతోంది. కొత్త కేసులు కాస్త తగ్గినప్పటికీ.. సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంది. గడిచిన 24 గంటల్లో 83,347 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో 1,085 మంది మరణించారు. నిన్న 89,746 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 56,46,010కి చేరింది. కరోనాను జయించి 45,87,613 మంది పూర్తిగా కోలుకున్నారు. వైరస్‌తో పోరాడుతూ 90,020 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మనదేశంలో 9,68,377 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఐతే కొత్త కేసులు కాస్త తగ్గుముఖం పట్టడం.. రికవరీలు పెరగడం ఊరటనిచ్చే విషయం.

టెస్ట్‌ల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో మనదేశంలో 9,53,683 శాంపిల్స్ పరీక్షించారు. భారత్‌లో ఇప్పటి వరకు 6 కోట్ల 62 లక్షల 79,462 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది. మనదేశంలో మహారాష్ట్రలోనే అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 12,42,770 మందికి కరోనా సోకగా.. 33,407 మంది మరణించారు. ఇక రెండో స్థానంలో ఏపీ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 6,39,302 కేసులు నమోదవగా.. 5,461 మంది చనిపోయారు. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్నాటక, యూపీ రాష్ట్రాలున్నాయి.


రాష్ట్రాల వారీగా కరోనా కేసుల వివరాలు
Published by: Shiva Kumar Addula
First published: September 24, 2020, 9:32 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading