Corona India : 17 వేలు దాటిన కరోనా కేసులు.. 543 మంది మృతి..

ప్రతీకాత్మక చిత్రం

Corona Cases in India : కరోనా ప్రభావం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్ పరిస్థితి మెరుగ్గానే ఉన్నా.. టెస్టులు నిర్వహణ రేటు తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

  • Share this:
    Corona Cases in India : కరోనా ప్రభావం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్ పరిస్థితి మెరుగ్గానే ఉన్నా.. టెస్టులు నిర్వహణ రేటు తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సగటున ప్రతి పది లక్షల మందికి దేశవ్యాప్తంగా 254 మందికి మాత్రమే టెస్టులు నిర్వహిస్తున్నారు. కరోనా టెస్టులు చేస్తే పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువే ఉండొచ్చన్నది విశ్లేషకుల అభిప్రాయం. అయితే, దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న మరణాలు తక్కువ స్థాయిలోనే ఉండటం ఆశించదగ్గ పరిణామం. కాగా, ఈ రోజు(సోమవారం) ఉదయానికి కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 17 వేలు దాటింది. దేశంలో మొత్తం 17265 మంది కోవిడ్19కు గురయ్యారు. అందులో ఇప్పటి వరకు 543 మంది మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 14,175 ఉన్నాయి. మరో 2546 మంది కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారు.

    కాగా, మహారాష్ట్రలో అత్యధికంగా 4,203 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఢిల్లీ(2003), గుజరాత్(1743), రాజస్థాన్(1478), తమిళనాడు (1477), మధ్యప్రదేశ్(1407), ఉత్తరప్రదేశ్ (1084) ఉన్నాయి. తెలంగాణలో 844 కేసులు, ఏపీలో 646 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల్లో తెలంగాణ 8వ స్థానంలో, ఏపీ 9వ స్థానంలో ఉన్నాయి.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: