రోజుకు 10 లక్షల టెస్ట్‌లు టార్గెట్.. ICMR ల్యాబ్స్ ప్రారంభించిన ప్రధాని మోదీ

కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటంలో ముందు వరసులో ఉన్న డాక్టర్లు, వైద్య సిబ్బందిపై ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ కరోనా సంక్షోభాన్ని భారత్ అవకాశంగా మలచుకుందని.. పీపీఈ కిట్ల తయారీలో భారత్ ఇప్పుడు రెండో స్థానంలో ఉందని ఆయన చెప్పారు.

news18-telugu
Updated: July 27, 2020, 8:20 PM IST
రోజుకు 10 లక్షల టెస్ట్‌లు టార్గెట్.. ICMR ల్యాబ్స్ ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
  • Share this:
సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్లే.. కరోనా పోరాటంలో భారత్ మెరుగైన స్థితిలో ఉందని ప్రధాని మోదీ అన్నారు. దేశవ్యాప్తగా 1300 పరీక్షా కేంద్రాల్లో రోజుకు 5 లక్షల పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలిపారు. రోజుకు 10 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించేలా పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచుతున్నామని ఆయన చెప్పారు. ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో అధునాతన సదుపాయాలు కలిగిన ల్యాబొరేటరీలను ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. నోయిడా, ముంబై, కోల్‌కతాలో వీటిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పాల్గొన్నారు.

ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలోని అత్యాధునిక పరీక్షా కేంద్రాలు అందుబాటులోకి రావడం కరోనాపై దేశం కొనసాగిస్తున్న పోరుకు మరింత బలం చేకూర్చాయి. వీటి ద్వారా ప్రతి రోజు అదనంగా మరో 10 వేల పరీక్షలు చేయవచ్చు. వీటిలో కరోనా టెస్టుల కోసం మాత్రమే కాకుండా డెంగ్యూ, హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ బీ, సీ వంటి పలు రకాల టెస్టులను నిర్వహిస్తారు.
ప్రధాని మోదీ
కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటంలో ముందు వరసులో ఉన్న డాక్టర్లు, వైద్య సిబ్బందిపై ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ కరోనా సంక్షోభాన్ని భారత్ అవకాశంగా మలచుకుందని.. పీపీఈ కిట్ల తయారీలో భారత్ ఇప్పుడు రెండో స్థానంలో ఉందని ఆయన చెప్పారు. గతంలో ఒక్క పీపీఈ కిట్ కూడా తయారు చేయలేదని.. కాన ఈ ఐదు నెలల కాలంలోనే లక్షలాది పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్క్‌లు తయారు చేసిందని అన్నారు.

ఇక భారత్‌లో రోజు వారీ కరోనా కేసులు 50 వేల దాకా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 49931 మందికి కరోనా సోకింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1435453కి చేరింది. అలాగే... గత 24 గంటల్లో 708 మంది చనిపోవడంతో... దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్యం 32771కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ కేసులు 917568 ఉండగా... యాక్టివ్ కేసులు 485114 నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల కంటే... రికవరీ కేసులే ఎక్కువగా ఉండటం వల్ల దేశంలో రోజువారీ ఎన్ని కేసులు నమోదవుతున్నా... కరోనా కట్టడిలో భారత్ మెరుగ్గానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Published by: Shiva Kumar Addula
First published: July 27, 2020, 8:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading