హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Zero Cases: రెండేళ్లలో తొలిసారి...భారత్ లోని ఆ రాష్ట్రంలో ఒక్క కోవిడ్ కేసు కూడా లేదు

Zero Cases: రెండేళ్లలో తొలిసారి...భారత్ లోని ఆ రాష్ట్రంలో ఒక్క కోవిడ్ కేసు కూడా లేదు

దేశంలో తగ్గిన కోవిడ్ వ్యాప్తి(ప్రతీకాత్మక చిత్రం)

దేశంలో తగ్గిన కోవిడ్ వ్యాప్తి(ప్రతీకాత్మక చిత్రం)

Covid Cases In India  : కరోనా కోరల నుంచి భారత్ ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా రోజువారీ కోవిడ్ కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది.

Covid Cases In India  : కరోనా కోరల నుంచి భారత్ ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా రోజువారీ కోవిడ్ కేసుల్లో(Covid Cases In India) గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా దేశంలో 861 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఆరుగురు చనిపోయారు. ఛత్తీస్​గఢ్​ లో సున్నా కేసులు(Chattisgarh Covid Cases)నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో ఒక్క కరోనా కేసు కూడా బయటపడలేదని, రెండేళ్లలో ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. ఇక,దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 929 మంది వైరస్‌ నుంచి కోలుకున్నట్లు సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక,తాజా కేసులో కలిసి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 4,30,36,132‬కి చేరుకోగ,మొత్తం మరణాల సంఖ్య 5,21,691కి చేరుకుంది. 4,25,03,383 మంది ఇప్పటివరకు కోవిడ్ నుంచి కోలుకున్నారు.

కాగా, ప్రస్తుతం మొత్తం కేసుల్లో యాక్టివ్‌ గా ఉన్నది 0.03 శాతం మాత్రమేనని, రికవరీ రేటు 98.76 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో వ్యాక్సినేషన్(Covid Vaccination In India) కార్యక్రమం వేగంగా సాగుతోంది. ఆదివారం 2,44,870 మందికి టీకాలు అందించారు. . ఇప్పటిరకు దేశవ్యాప్తంగా మొత్తం పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,85,74,18,827కు చేరింది.

ALSO READ Shocking : ఆ కారణంతో భార్య ఆత్మహత్య..చితిలో దూకేసిన భర్త

మరోవైపు,దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండినవారికి బూస్టర్ డోసుల పంపిణీ ఆదివారం నుంచి ప్రారంభం అయిన సమయంలో రెండు ప్రధాన తయారీదారులు టీకాల ధరలను భారీగా తగ్గించాయి. ప్రైవేటు ఆస్పత్రులకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ ధర (ఒక డోసుకు) రూ.600 నుంచి రూ.225 అయింది. అలాగే, కొవాగ్జిన్ ధర(ఒక డోసు) రూ.1200 నుంచి రూ.225కు తగ్గింది. ఈ మేరకు సీరం ఇనిస్టిట్యూట్ ఈసీవో అధర్ పూనావాలా, భారత్ బయోటెక్ అధినేత్రి సుచిత్రా ఎల్లా శనివారం ఒకే సమయంలో వేర్వేరుగా ప్రకటనలు చేశారు. అయితే, గతానికి భిన్నంగా బూస్టర్ డోసుల పంపిణీని కేవలం ప్రైవేటు ఆస్పత్రుల్లోని టీకా కేంద్రాల్లో మాత్రమే అందించనున్నారు. ప్రభుత్వం ఉచితంగా అందించే టీకా కేంద్రాల్లో బూస్టర్ డోసుల పంపిణీపై ఇంకా నిర్ణయం జరగలేదు.

First published:

Tags: Corona casess, Covid -19 pandemic, Covid cases, Covid vaccine

ఉత్తమ కథలు