ఆంధ్రా వ్యక్తికి కరోనా పాజిటివ్.. యూపీలో 14 గ్రామాలు మూసివేత

యూపీలో ఇప్పటి వరకు 550 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారితో పోరాడి 47 మంది కోలుకోగా.. ఐదుగురు చనిపోయారు.

news18-telugu
Updated: April 13, 2020, 5:18 PM IST
ఆంధ్రా వ్యక్తికి కరోనా పాజిటివ్.. యూపీలో 14 గ్రామాలు మూసివేత
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి వల్ల యూపీలో ఏకంగా 14 గ్రామాలు క్వారంటైన్‌లోకి వెళ్లాయి. అతడికి కరోనా వైరస్ సోకడంతో ముందు జాగ్రత్తగా చుట్టు పక్కల గ్రామాలన్నింటినీ మూసివేశారు. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. ఏపీకి చెందిన ఓ వ్యక్తి బడౌన్ జిల్లా భవానీపూర్ కాలీలోని ఓ ప్రార్థనా మందిరంలో నివసిస్తున్నాడు. అతడు గత నెలలో ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లీఘీ జమాత్ సదస్సుకు హాజరయ్యాడు. ఆ తర్వాత కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నాడు. శనివారం వచ్చిన రిపోర్టులో కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. అతడికి కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితుడు నివసించిన ప్రాంతానికి 3 కి.మీ. పరిధిలో మొత్తం 14 గ్రామాలను నిర్బంధంలో ఉంచారు.

అతడికి కరోనా ఉన్నట్లు తేలడంతో, అతడు నివసిస్తున్న ప్రాంతానికి 3 కి.మీ. వ్యాసార్థంలో ఉన్న 14 గ్రామాలను జిల్లా అధికార యంత్రాంగం మూసివేసింది. ప్రస్తతుం ఆ 14 గ్రామాలు క్వారంటైన్‌లో ఉన్నాయి.
కుమార్ ప్రశాంత్, బడౌన్ జిల్లా మెజిస్ట్రేట్


కాగా, ఉత్తర ప్రదేశ్ ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. యూపీలో ఇప్పటి వరకు 550 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారితో పోరాడి 47 మంది కోలుకోగా.. ఐదుగురు చనిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 498 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.


First published: April 13, 2020, 5:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading