తెలంగాణలో ప్లాస్మా దానానికి ముందుకు రాని వాలంటీర్లు

గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు నిత్య ఫోన్ కాల్స్ చేస్తున్నప్పటికీ ఎవరూ పెద్దగా స్పందించడం లేదని డాక్టర్లు తెలిపారు. 'నేను వేరే ఊరిలో ఉన్నాను', 'కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు', 'నాకు టైమ్ లేదు' అనే ఎక్కువ మంది సమాధానం చెబుతున్నారు.

news18-telugu
Updated: July 9, 2020, 9:04 AM IST
తెలంగాణలో ప్లాస్మా దానానికి ముందుకు రాని వాలంటీర్లు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. విషమ పరిస్థితుల్లో ఉన్న రోగులకు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తే పలువురు కోలుకున్నారు. ఈ క్రమంలో కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలని ప్రభుత్వాలు పిలుపునిచ్చాయి. కానీ తెలంగాణ ప్లాస్మా దానం చేసేందుకు వాలంటీర్లు ముందుకు రావడం లేదు. ఇప్పటి వరకు కేవలం 19 మంది వాలంటీర్లు మాత్రమే ప్లాస్మా దానం చేశారు. కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మాతో ఓ నిండు ప్రాణాన్ని కాపాడవచ్చని తెలిసినా.. ఎందుకో చాలా మంది మాత్రం ముందుకు రావడం లేదు.

తెలంగాణలో ఇప్పటి వరకు 17,279 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వారికి గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు నిత్యం ఫోన్ కాల్స్ చేస్తున్నప్పటికీ ఎవరూ పెద్దగా స్పందించడం లేదని డాక్టర్లు తెలిపారు. 'నేను వేరే ఊరిలో ఉన్నాను', 'కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు', 'నాకు టైమ్ లేదు' అనే ఎక్కువ మంది సమాధానం చెబుతున్నారు.

గత 4 నెలల్లో కేవలం 19 మంది మాత్రమే ప్లాస్మాను దానం చేశారు. ఇక తబ్లీఘీ జమాత్ నుంచి వచ్చి కరోనా బారినపడిలో వారు చాలా మంది కోలుకున్నారు. వారిలో 32 మంది ప్లాస్మా దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలిపిన విషయం తెలిసిందే. ఐతే వారిలో ఎవరూ ప్లాస్మాను ఇచ్చేందుకు ముందుకు రాలేదని వైద్యాధికారులు చెప్పారు. ఇక తెలంగాణలో ప్లాస్మా దానం చేసిన తొలి వ్యక్తి అఖిల్.. మిగతా వారు కూడా ప్లాస్మాను దానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్లాస్లా దానం చేస్తే శరీరంలో రక్తం తగ్గిపోదని.. రక్త నుంచి ప్లాస్మాను మాత్రమే వేరుచేసి, రక్తాన్ని తిరిగి దాత శరీరంలోకే పంపిస్తారని చెప్పారు.

కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు 29,536 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 17,279 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. మరో 324 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 11,933 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 1,34,801 కరోనా పరీక్షలు చేసినట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.
Published by: Shiva Kumar Addula
First published: July 9, 2020, 8:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading