తెలంగాణలో రాష్ట్రపతి పాలన.. కాంగ్రెస్ ఎంపీ డిమాండ్...

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: July 16, 2020, 5:04 PM IST
తెలంగాణలో రాష్ట్రపతి పాలన.. కాంగ్రెస్ ఎంపీ డిమాండ్...
ఎంపీ కోమటిరెడ్డి, సీఎం కేసీఆర్
  • Share this:
తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ నెలకొందని, ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా కట్టడి విషయంలో అసలు ఎలాంటి శ్రద్ధ తీసుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యాలను కేసీఆర్ గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం పైన, కరోనా పైన సమీక్ష నిర్వహించకుండా సచివాలయం మీద సమీక్ష నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ సమయంలో రూ.1000 కోట్ల తో కొత్త సచివాలయ నిర్మాణం అవసరమా? అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. ‘దేశంలో ఇంత దుర్మార్గమైన పాలన ఏ రాష్ట్రంలో కూడా లేదు. దేశ ప్రజలు కేసీఆర్ పాలనను చూసి అసహించుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యాలను కాపాడని కేసీఆర్ ,ముఖ్యమంత్రి గా కొనసాగడానికి అనర్హుడు. వెంటనే కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. టీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోతున్నారు. కేసీఆర్ పాలన పైన ఎవరికి నమ్మకం లేదు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ నెలకొంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ లో రాష్ట్రపతి పాలనను విధించాలి. త్వరలోనే రాష్ట్రపతిని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలం కలుస్తాం. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను రాష్ట్రపతికి నివేదిస్తాం.’ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

ఉస్మానియా హాస్పిటల్ లోకి నీళ్లు వచ్చాయంటే ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అర్ధమవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. కమిషన్లు దండుకోవడం తప్ప ప్రజల ఆరోగ్యం పైన ముఖ్యమంత్రి కేసీఆర్ కు శ్రద్ధ లేదని కోమటిరెడ్డి ఆరోపించారు. వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉస్మానియా హాస్పిటల్ ను సందర్శించాలని డిమాండ్ చేశారు. కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని డిమాండ్ చేసిన ఈ ప్రభుత్వం చేర్చడం లేదన్నారు. కరోనాతో ప్రజలు చనిపోతుంటే కేసీఆర్ కు కనబడడం లేదా అని ప్రశ్నించారు. కరోనా మందులను, ఆక్సిజన్ సిలెండర్లను బ్లాక్ లో అమ్ముతుంటే చర్యలు తీసుకోవడం లేదన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 16, 2020, 5:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading