IMPACT OF CORONAVIRUS ON THE INDIAN REAL ESTATE AND CONSTRUCTION INDUSTRY MK
Coronavirus: రియల్ ఎస్టేట్ రంగానికి కరోనాతో కోలుకోలేని దెబ్బ...
ప్రతీకాత్మక చిత్రం
దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా భవన నిర్మాణ కార్మికులు పనులుకు రాకుండా ఆగిపోయారు. అంతేకాదు అటు సిమెంట్, స్టీల్ సహా ఇతర ఉత్పత్తుల తయారీ రంగం కూడా నిలిచిపోయింది. ఫలితంగా రియల్ ఎస్టేట్ రంగానికి ఇది కోలుకోలేని దెబ్బగా మారింది.
కరోనా వైరస్ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఘోరంగా దెబ్బతీసింది. ప్రాజెక్టులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ముఖ్యంగా దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా భవన నిర్మాణ కార్మికులు పనులుకు రాకుండా ఆగిపోయారు. అంతేకాదు అటు సిమెంట్, స్టీల్ సహా ఇతర ఉత్పత్తుల తయారీ రంగం కూడా నిలిచిపోయింది. ఫలితంగా రియల్ ఎస్టేట్ రంగానికి ఇది కోలుకోలేని దెబ్బగా మారింది. ముఖ్యంగా ప్రాజెక్టులు నిలిచి పోతే అది రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ముఖ్యంగా పనుల్లో జాప్యం కారణంగా, ప్రాజెక్టు అనుకున్న సమయం కన్నా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అలాగే భవిష్యత్తులో కరోనా కారణంగా బ్యాంకులకు లిక్విడిటీ సమస్య ఏర్పడే అవకాశం ఉందని, ఇదే జరిగితే నిధుల సమస్య కూడా తలెత్తే సమస్య రావొచ్చని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే కరోనా మహమ్మారితో ఈ సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో నివాస గృహాల అమ్మకాలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఏకంగా 42 శాతం తగ్గాయి. హైదరాబాద్లో అయితే పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో అమ్మకాలు దాదాపు 50 శాతం పడిపోయాయి. దేశంలోని మరే నగరంలోనూ అమ్మకాలు ఈ స్థాయిలో పడిపోలేదు. స్థిరాస్తి రంగం తీరుతెన్నులను పరిశీలించే బ్రోకరేజీ సంస్థ అనరాక్ తన తాజా నివేదికలో ఈ విషయం తెలిపింది. 2019 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంతో పోల్చితే 2020 జనవరి-మార్చి త్రైమాసికంలో ఏడు ప్రధాన నగరాల్లో నివాల గృహాల అమ్మకాలు 24 శాతం తగ్గాయి. ఉన్న ప్రాజెక్టులే అమ్ముడుపోక పోవడంతో చాలా మంది బిల్డర్లు కొత్త ప్రాజెక్టులను వాయిదా వేస్తున్నట్టు అనరాక్ తెలిపింది. కాగా, ఢిల్లీలో 41 శాతం, ముంబై, పుణెల్లో 42 శాతం, బెంగళూరులో 45 శాతం, చెన్నైలో 36 శాతం అమ్మకాలు తగ్గాయి.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.