ఈ ట్రంకు పెట్టెలో పెడితే డబ్బులు, సరుకులపై ఉండే కరోనా వైరస్‌ ఖతం..

డబ్బులు, కూరగాయలు, పాల ప్యాకెట్లు, ఆన్ లైన్ ద్వారా డెలివరీ అయిన వస్తువులు, చేతి వాచీలు, పర్సులు, మొబైల్ ఫోన్లు, ఏవైనా పత్రాలను కూడా దీంట్లో పెట్టొచ్చని చెబుతున్నారు.

news18-telugu
Updated: April 10, 2020, 3:42 PM IST
ఈ ట్రంకు పెట్టెలో పెడితే డబ్బులు, సరుకులపై ఉండే కరోనా వైరస్‌ ఖతం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రజలు అందరికీ ఓ భయం. బయటకు వెళ్లినప్పుడు నిత్యాసవరాలు కొనుగోలు చేసినప్పుడు వాటి మీద ఎవరో కరోనా వైరస్ సోకిన వ్యక్తి చేయిపెట్టి ఉండొచ్చు. ఆ క్రిములు దాని మీద ఉండొచ్చు. అలాగే, కరోనా వైరస్ సోకిన వ్యక్తి నుంచి డబ్బులు తీసుకున్నా, ఇచ్చినా, (సరుకులు, పాలు, ఇతరత్రా వస్తువులు కొన్నప్పుడు) వైరస్ మనకు కూడా సోకుతుందేమోనని భయం అందరిలోనూ ఉంది. అయితే, ఇకపై భయపడాల్సిన పనిలేదు. కరెన్సీ, సరుకుల మీద ఉండే కరోనా వైరస్‌ను చంపేసే పరికరాన్ని ఐఐటీ రోపార్ అభివృద్ధి చేసింది. ట్రంకు పెట్టె ఆకారంలో ఉండే ఈ వస్తువు అల్ట్రావయొలెట్ జర్మిసైడెల్ ఇర్‌రేడియేషన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. దీన్ని మన గుమ్మం వద్ద పెట్టుకోవాలి. మనం బయట నుంచి తీసుకొచ్చిన సరుకులు, డబ్బులను దాని కింద పెట్టాలి. వాటి పైన ఉండే కరోనా వైరస్‌ను ఆ పరికరం చంపేస్తుంది. ఇది పూర్తిస్థాయిలో బయటకు వచ్చిన తర్వాత దాని ధర సుమారు రూ.500 ఉండొచ్చని అంచనా. వైరస్‌ను అంతం చేయడానికి దీనికి కనీసం 30 నిమిషాలు పడుతుంది. 30 నిమిషాలు శానిటైజ్ చేసిన తర్వాత ఓ పది నిమిషాలు చల్లబడే వారకు అలాగే వదిలేయాలి.

‘ఇళ్లలో కూర్చోవడం, బయటకు వచ్చినా సామాజిక దూరం పాటించడం ఒక్కటే సరిపోదు. రాబోయే రోజుల్లో కరోనా వైరస్ వ్యాప్తిని నివారించాలంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం చాలా మంది కూరగాయలను కూడా వేడి నీళ్లలో కడుగుతున్నారు. అయితే, డబ్బులను అలా కడగలేరు కదా. మేం ట్రంకు పెట్టె ఆకారంలో ఉండే ఓ పరికరాన్ని తయారు చేశాం. దీన్ని గుమ్మం వద్ద పెట్టుకోవచ్చు. లేదా, ఇంటి లోపలికి రావడానికి ముందు బయట ఎక్కడైనా దీన్ని పెట్టొచ్చు. ’ అని ఐఐటీ రోపార్ సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ న్యూస్ ఏజెన్సీ పీటీఐకి తెలిపారు.

డబ్బులు, కూరగాయలు, పాల ప్యాకెట్లు, ఆన్ లైన్ ద్వారా డెలివరీ అయిన వస్తువులు, చేతి వాచీలు, పర్సులు, మొబైల్ ఫోన్లు, ఏవైనా పత్రాలను కూడా దీంట్లో పెట్టొచ్చని చెబుతున్నారు. వాటర్ ప్యూరిఫయర్లలో వినియోగించే అల్ట్రావయొలెట్ జర్మిసైడెల్ ఇర్‌రేడియేషన్ టెక్నాలజీని ఇందులో వినియోగిస్తున్నారు. దీని వల్ల ఎలాంటి భయపడాల్సిన పనిలేదని చెప్పారు.
First published: April 10, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading