కరోనా టెస్టులు సరిగ్గా చేస్తే భారత్, చైనాలు అమెరికాను దాటేస్తాయి...ట్రంప్...

అమెరికాలో కోవిడ్ -19 టెస్టులపై వ్యాఖ్యానించిన ట్రంప్ మాట్లాడుతూ...ఎన్ని ఎక్కువ టెస్టులు జరిపితే అన్ని ఎక్కువ కేసులు వస్తాయని పేర్కొన్నారు. ఎక్కువ మందికి టెస్టులు నిర్వహిస్తున్న కారణంగా ఎక్కువ కేసులు అమెరికాలో ఉన్నాయని ఆయన అన్నారు. చైనా లేదా భారత్ లో ఈ తరహాలో టెస్టులు చేస్తే అక్కడ ఎక్కువ కేసులు ఉంటాయని ట్రంప్ అన్నారు.

news18-telugu
Updated: June 7, 2020, 7:08 AM IST
కరోనా టెస్టులు సరిగ్గా చేస్తే భారత్, చైనాలు అమెరికాను దాటేస్తాయి...ట్రంప్...
డోనాల్డ్ ట్రంప్
  • Share this:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సారి తన నోటికి పనిచెప్పారు. భారత్, చైనాల్లో విరివిగా కరోనా టెస్టులు చేయడం లేదని, ఒకవేళ సరిగ్గా టెస్టులు చేస్తే, అమెరికా కంటే కరోనావైరస్ కేసులు ఎక్కువగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో రెండు కోట్ల మందికి కరోనా టెస్టులు చేసినట్లు ట్రంప్ ఒక కార్యక్రమంలో తెలిపారు. జర్మనీకి 40 లక్షలు, దక్షిణ కొరియా 30 లక్షల కరోనా టెస్టులు చేసినట్లు ఆయన తెలిపారు. ఇక జాన్స్ హాప్కిన్స్ కరోనా వైరస్ రిసోర్స్ సెంటర్ ప్రకారం, అమెరికాలో 19 లక్షల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అందులో 1,09,000 మంది మరణించారు. అయితే భారతదేశంలో 2,36,184, చైనాలో 84,177 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల అమెరికా ఎక్కువగా ప్రభావితమవుతోంది.

భారత్ లో 40 లక్షల కరోనా టెస్టులు

ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశం ఇప్పటివరకు 40 లక్షల మందికి కరోనా వైరస్ టెస్టులను నిర్వహించింది. అమెరికాలో కోవిడ్ -19 టెస్టులపై వ్యాఖ్యానించిన ట్రంప్ మాట్లాడుతూ...ఎన్ని ఎక్కువ టెస్టులు జరిపితే అన్ని ఎక్కువ కేసులు వస్తాయని పేర్కొన్నారు. ఎక్కువ మందికి టెస్టులు నిర్వహిస్తున్న కారణంగా ఎక్కువ కేసులు అమెరికాలో ఉన్నాయని ఆయన అన్నారు. చైనా లేదా భారత్ లో ఈ తరహాలో టెస్టులు చేస్తే అక్కడ ఎక్కువ కేసులు ఉంటాయని ట్రంప్ అన్నారు.

ఇక నెలవారీ జాబ్స్ డేటాను ఉటంకిస్తూ ట్రంప్ మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు తిరిగి ట్రాక్‌లోకి వచ్చిందని. భయాలు రియాలిటీగా మారడానికి తాము అనుమతించలేదని, ఇది అమెరికన్ చరిత్రలోనే నెలవారీ జాబ్స్ డేటాలో అతిపెద్ద పెరుగుదల అని ట్రంప్ అన్నారు. నవంబర్ 3 న జరగబోయే ఎన్నికలకు కొన్ని నెలల ముందు అద్భుతం జరుగుతుందని ట్రంప్ అంచనా వేశారు.

నవంబర్ 3 న దేశానికి అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండగా, ట్రంప్ రెండవసారి పదవిని పొందటానికి ప్రయత్నిస్తున్నారు. ఈసారి ఆయన డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ను ఎదుర్కొంటారు. చాలా ప్రీ-పోల్ సర్వేల ప్రకారం, బిడెన్ ట్రంప్ కంటే చాలా ముందున్నాడు.

చైనాపై ఆరోపణలు...
ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవని ట్రంప్ అన్నారు, ఎందుకంటే తన బదులు వేరే అధ్యక్షుడిని ఎన్నుకుంటే, అతను పన్నులు పెంచవచ్చు. సరిహద్దులను తెరవవచ్చు, తద్వారా ప్రతి ఒక్కరూ దేశంలోకి ప్రవేశిస్తారు. కరోనా వైరస్ శత్రువును ఓడించడానికి, అమెరికా ప్రభుత్వం పరిశ్రమకు బలాన్ని ఇచ్చిందని ట్రంప్ అన్నారు. ఇది నిజంగా శత్రువు అని చైనా నుండి వచ్చిందని మరోసారి ఆరోపించారు.
First published: June 7, 2020, 7:08 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading