ఒక్క కరోనా రోగి వల్ల 406 మందికి వైరస్ వ్యాప్తి.. షాకింగ్ రిపోర్ట్

మనదేశంలో ఇప్పటి వరకు 5,149 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 149 మంది చనిపోయారు. మరో 401 మంది మంది కోవిడ్-19 మహమ్మారి నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

news18-telugu
Updated: April 8, 2020, 2:15 PM IST
ఒక్క కరోనా రోగి వల్ల 406 మందికి వైరస్ వ్యాప్తి.. షాకింగ్ రిపోర్ట్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సామాజిక దూరమే శ్రీరామ రక్ష..! 130 కోట్లు జనాభా కలిగి.. సరైన వైద్య సదుపాయాలు లేని.. మన దేశంలో కరోనావైరస్ నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..! కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే చెబుతున్న మాట ఇది. అందుకే 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ఒకరి నుంచి మరికొరికి వ్యాధి సంక్రమించకూడదనే ఉద్దేశంతో.. కరోనాను కట్టడి చేసేందుకు ఈ అస్త్రాన్ని ప్రయోగించారు. ఐతే దేశమంతటా పకడ్బందీగా లాక్‌డౌన్ అమలవుతున్నా.. కొందరు మాత్రం చాలా లైట్‌గా తీసుకుంటున్నారు. ఎలాంటి కారణం లేకుండానే రోడ్లపై తిరుగుతున్నారు. పల్లెల్లోనూ పలు చోట్ల ఇలాంటి సీనే కనిపిస్తోంది. యువత గుంపులు గుంపులుగా తిరుగుతూ పార్టీలు చేసుకుంటున్నారు. క్రికెట్ వంటి ఆటలు ఆడుతున్నారు. లాక్‌డౌన్‌ను పాటించుకుండా ఇలా చేయడం ఎంత ప్రమాదకరమో.. కేంద్రం సంచలన విషయాన్ని బయటపెట్టింది.

కోవిడ్-19 వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే అంటువ్యాధి. ఈ మహమ్మారి బారిన పడి వ్యక్తి తుమ్మినా, దగ్గినా.. ఆ తుంపర్ల ద్వారా వైరస్ బయటకు వచ్చి ఇతరులకు అంటుకుంటుంది. అతడు ముట్టుకున్న వస్తువులను తాకినా.. సంక్రమిస్తుంది. ఈ నేపథ్యంలో జనాలు గుంపులు గుంపులుగా తిరిగితే.. కోవిడ్-19 చాలా మందికి వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక కరోనా రోగి లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి.. సామాజిక దూరం పాటించకుంటే.. అతడి వల్ల నెల రోజుల్లో సుమారు మరో 406 మందికి వైరస్ సంక్రమిస్తుందని ICMR పరిశోధనలో తేలింది. అదే జనాలంతా లాక్‌డౌన్‌ను ఉల్లంఘించకుండా.. సామాజిక దూరం పాటిస్తే.. ఒక రోగి వల్ల నెల రోజుల్లో సగటున 2.5 మందికి మాత్రమే సోకే అవకాశముంది. లాక్‌డౌన్‌ను పాటించడం ఎంత ముఖ్యమో..దీన్ని బట్టే అర్ధమవుతోంది. అందుకే లాక్‌డౌన్‌ను ప్రజలందరూ పాటించాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. మరిన్ని రోజులు కూడా పొడిగించాలని కేంద్రాన్ని రాష్ట్రాలు కోరుతున్నాయి.


ఐతే లాక్‌డౌన్ పొడిగింపుపై ఇప్పటి వరకు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రవైద్యఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు. లాక్‌డౌన్ పొడిగింపుపై రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు నిజమేనని.. వాటిని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు. త్వరలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. మనదేశంలో ఇప్పటి వరకు 5,149 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 149 మంది చనిపోయారు. మరో 401 మంది మంది కోవిడ్-19 మహమ్మారి నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం మనదేశంలో 4643 యాక్టివ్ కేసులున్నాయి.
First published: April 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading