కరోనా పరీక్షల ధరలపై ఐసీఎంఆర్ కీలక నిర్ణయం..

కరోనా పరీక్షలకు సంబంధించిన కిట్లు మార్కెట్‌లో భారీగా అందుబాటులో ఉండటంతో పాటు ప్రైవేట్ ల్యాబ్‌ల మధ్య విపరీతమైన పోటీ నేపథ్యంలో ధరలు దిగి వచ్చే అవకాశం వుందని ఐసీఎంఆర్ తెలిపింది.

news18-telugu
Updated: May 27, 2020, 1:04 PM IST
కరోనా పరీక్షల ధరలపై ఐసీఎంఆర్ కీలక నిర్ణయం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా పరీక్షలపై ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిపల్ అఫ్ మెడికల్ రీసెర్చ్) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం గతంలోనే కొన్ని ప్రైవేట్ ల్యాబ్స్‌కు అనుమతి ఇచ్చిన ఐసీఎంఆర్... టెస్టుల ధరను రూ. 4500గా నిర్ణయించింది. అయితే తాజాగా దీనిపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఆయా రాష్ట్రాలకు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్రాలకు లేఖ రాసింది. కరోనా పరీక్షలకు సంబంధించిన కిట్లు మార్కెట్‌లో భారీగా అందుబాటులో ఉండటంతో పాటు ప్రైవేట్ ల్యాబ్‌ల మధ్య విపరీతమైన పోటీ నేపథ్యంలో ధరలు దిగి వచ్చే అవకాశం వుందని ఐసీఎంఆర్ తెలిపింది.

అందుకే ఈ విషయంలో రాష్ట్రాలు, ప్రైవేట్ ల్యాబ్‌లు, సంస్థలు పరస్పర అంగీకారంతో ధర నిర్ణయించుకోవచ్చని లేఖలో పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 428 ప్రభుత్వ ప్రయోగశాలలు, 182 ప్రైవేట్ ల్యాబ్‌లు కరోనా నిర్ధారణ పరీక్షల కోసం అందుబాటులో ఉన్నాయి. మే 26 నాటికి, రోజుకు లక్ష పరీక్షలు చేసే సామర్థ్యానికి దేశం చేరుకుందని ప్రకటించింది. ఈ పరీక్షల సామర్థ్యాన్ని రోజుకు 2 లక్షల పరీక్షలకు పెంచాలని భావిస్తోంది. ఇక రాబోయే నెల రోజుల్లో దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందనే వార్తలు వస్తుండటంతో... ఐసీఎంఆర్ ఈ రకమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

First published: May 27, 2020, 1:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading