కరోనా రాకుండా వారు ఆ మెడిసిన్ వాడొచ్చు.. ICMR క్లారిటీ

కోవిడ్‌పై ముందు వరసలో ఉండి పోరాటం చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది HCQని ప్రివెంటివ్ డ్రగ్‌గా వినియోగించవచ్చని తెలిపింది. ఈ డ్రగ్ వల్ల దుష్ఫలితాలు పెద్దగా ఉండవని.. అదనంగా ప్రయోజనం చేకూరే అవకాశముందని ICMR డీజీ డాక్టర్ బలరాం భార్గవ తెలిపారు.

news18-telugu
Updated: May 26, 2020, 7:50 PM IST
కరోనా రాకుండా వారు ఆ మెడిసిన్ వాడొచ్చు.. ICMR క్లారిటీ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనాపై పోరాటానికి హైడ్రాక్సి క్లోరోక్విన్ వాడొచ్చా? వద్దా? అనే దానిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో HCQ డ్రగ్‌ను ట్రయల్స్ నిలిపివేస్తున్నట్లు సోమవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. ఐతే ఆ ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే HCQపై భారత వైద్య పరిశోధనా మండలి కీలక ప్రకటన చేసింది. హైడ్రాక్సి క్లోరోక్విన్‌ను వాడవచ్చని స్పష్టం చేసింది. కోవిడ్‌పై ముందు వరసలో ఉండి పోరాటం చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది HCQని ప్రివెంటివ్ డ్రగ్‌గా వినియోగించవచ్చని తెలిపింది. ఈ డ్రగ్ వల్ల దుష్ఫలితాలు పెద్దగా ఉండవని.. అదనంగా ప్రయోజనం చేకూరే అవకాశముందని ICMR డీజీ డాక్టర్ బలరాం భార్గవ తెలిపారు.

కాగా, సోమవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. హైడ్రాక్సి క్వోరోక్విన్ గ్లోబల్ సాలిడారిటీ ట్రయల్స్ నిలిపివేస్తున్నట్లు తెలిపింది. కరోనా బాధితులకు హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ ఇవ్వడం వల్ల అనేక ఇతర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, కొన్ని సార్లు ఇది ప్రాణాంతకంగా మారుతున్నట్లు ద ల్యాన్సెట్‌ తన నివేదిక‌లో పేర్కొన్నట్లు WHO డైరక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ వాడకం నిలిపేసినట్లు ఆయన చెప్పారు. ఐతే భారత్ ఇప్పటికే చాలా దేశాలకు HCQ డ్రగ్‌ని ఎగుమతి చేసిన విషయం తెలిసిందే.
First published: May 26, 2020, 7:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading