Home /News /coronavirus-latest-news /

ICMR PAPER INSTRUCTIONS FOR RE OPENING OF SCHOOLS FOLLOW THESE RULES EVK

ICMR : పాఠ‌శాల‌ల్లో ఈ నిబంధ‌న‌లు పాటించండి.. ఐసీఎంఆర్ సూచ‌న‌లు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశ‌వ్యాప్తంగా పాఠ‌శాల‌లు తెరిచేందుకు ఆయా రాష్ట్రాలు క‌స‌ర‌త్తు చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఐసీఎంఆర్ సంస్థ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ బ‌ల‌రాం భార్గ‌వ్‌, శాస్త్ర‌వేత్త‌లు ఆనంద్‌, స‌మీర‌న్ పాండాలు రాసిన రీసెర్చ్ పేప‌ర్‌ను ఇండియ‌న్ జ‌ర్న‌ల్ మెడిక‌ల్ రీసెర్చ్‌ (Medical Research)లో ప్ర‌చురితమైంది.

ఇంకా చదవండి ...
    దేశ‌వ్యాప్తంగా పాఠ‌శాల‌లు తెరిచేందుకు ఆయా రాష్ట్రాలు క‌స‌ర‌త్తు చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (Indian Council of Medical Research) ప‌లు సూచ‌న‌లు స‌ల‌హాల‌ను విడుద‌ల చేసింది. ఐసీఎంఆర్ సంస్థ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ బ‌ల‌రాం భార్గ‌వ్‌, శాస్త్ర‌వేత్త‌లు ఆనంద్‌, స‌మీర‌న్ పాండాలు రాసిన రీసెర్చ్ పేప‌ర్‌ను ఇండియ‌న్ జ‌ర్న‌ల్ మెడిక‌ల్ రీసెర్చ్‌ (Medical Research)లో ప్ర‌చురితమైంది. కోవిడ్ (Covid 19) కార‌ణంగా దీర్ఘ‌కాలం పాఠ‌శాల‌లు మూసి ఉంచ‌డం స‌రికాద‌ని వారు అభిప్రాయ ప‌డ్డారు. ఎక్కువ‌కాలం పాఠ‌శాల‌లు తెర‌వ‌క పోతే విద్యార్థుల (Students) స‌ర్వ‌తోముఖాభివృద్ధికి ఆట‌కం క‌లుగుతుంద‌ని వారు తెలిపారు. పాఠ‌శాల‌ల‌ను ద‌శ‌ల వారీగా తెర‌వాల‌ని, ప‌లు కోవిడ్ నిబంధ‌న‌లు జాగ్ర‌త్త‌గా పాటించాల‌ని సూచించారు. త‌ర‌గ‌తి గ‌దిలో కంటే గాలి వెలుతురు ఉన్న ప్ర‌దేశాల్లో పిల్ల‌ల‌కు పాఠాలు చెప్పాల‌ని సూచించింది. ముందుగా ప్రాథ‌మిక‌, త‌రువాత మాధ్య‌మిక‌, త‌రువాత ఉన్న‌త‌ పాఠ‌శాల‌లు ద‌శ‌ల వారీగా తెర‌వాల‌ని వారు సూచించారు.

    ఐసీఎంఆర్ సూచ‌న‌లు..
    - విద్యా సంస్థ‌లు తెరుస్తున్న స‌మ‌యంలో ముఖ్యంగా ఉపాధ్యాయులు (Teachers), నాన్ టీచింగ్ స్టాఫ్, ర‌వాణా సిబ్బందికి వ్యాక్సినేష‌న్ పూర్తి చేయాలి. పాఠ‌శాల‌లు పూర్తిగా తెరుచుకొనే లోపు ఈ ప్ర‌క్రియ పూర్తి చేయాలి.

    AISSEE -2022: సైనిక్‌ స్కూల్స్ ప్ర‌వేశాలకు నోటిఫికేషన్‌ విడుదల.. వివరాలు ఇవే



    - ఉపాధ్యాయులు మాస్కులు ధ‌రించేలా చూడాలి. త‌ర‌గ‌తి గ‌దిలో విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గురైతే గుర్తించి వెంటేనే త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాలి.


    - ప్ర‌తీ పాఠ‌శాల‌కు ప‌రీక్ష కేంద్రం (Exam Centre) ఏర్పాటు చేసుకోవ‌డం ఉత్త‌మం. పాఠ‌శాల ఉన్న ప్ర‌దేశంలో కోవిడ్ కేసులు పెరిగితే పాఠ‌శాల‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించాలి.


    - త‌ర‌గ‌తి గ‌దిలో గాలి, వెలుతురు, వ‌చ్చేలా చూసుకోవాలి. అస‌వ‌రం అయితే పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో చెట్ల కింద బోధ‌న అందివ్వాలి. ఇది ఏమీ పాత ప‌ద్ధ‌తి కాద‌ని ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్ చెప్పిన విధాన‌మేన‌ని తెలిపారు. నెద‌ర్లాండ్‌, అమెరికా (America), డెన్మ‌ర్క్ వంటి దేశాల్లో పాఠ‌శాల‌లు బ‌హిరంగ ప్ర‌దేశాల్లోనే నిర్వ‌హిస్తున్నార‌ని తెలిపారు.


    - క్యాంటిన్ల‌లో పిల్ల‌లు ఎక్కువ సేపు క‌లిసి కూర్చోకుండా చూడాలి. క‌లిసి భోజ‌నం చేసేట‌ప్పుడు జాగ్ర‌త్త‌లు పాటించేలా చూడాలి.


    - ఎవ‌రైనా పిల్లు రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గురైతే అలాంటి వారికి ఆన్‌లైన్‌లో బోధ‌న అందించే ఏర్పాట్లు చేయాలి.


    - అన్నింటిక‌న్నా ముఖ్యంగా ప్ర‌త్యేక‌మైన బోధనా విధానాన్ని రూపొందించాలి. అంద‌రు పిల్ల‌లు పాఠ‌శాల‌కు రాకుండా రోజు విడిచి రోజు పాఠ‌శాల‌ల‌కు వ‌చ్చేఆ చూసుకోవాలి. ఈ హైబ్రీడ్ మోడ‌ల్ ద్వారా క‌రోనా వ్యాప్తిని అడ్డుకోవ‌చ్చ‌ని వారు పేర్కొన్నారు.

    Published by:Sharath Chandra
    First published:

    Tags: AP Schools, Covid -19 pandemic, EDUCATION, Students, Telangana schools

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు