నేడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులపై ICMR సర్వే

ప్రస్తుతం కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సర్వే చేపట్టారు. నివేదిక ఆధారంగా లాక్‌డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకోనుంది కేంద్ర ప్రభుత్వం.

news18-telugu
Updated: May 30, 2020, 6:19 AM IST
నేడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులపై ICMR సర్వే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత రెండు రోజులుగా వందకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులపై భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) సర్వెలైన్స్‌ సర్వే నిర్వహించనుంది. హైదరాబాద్‌లోని 5 కంటైన్మెంట్‌ జోన్లలో 2 రోజుల పాటు జాతీయ పౌష్టికాహార సంస్థ (NIN) టీమ్స్‌ అధ్వర్యంలో శనివారం నుంచి ఈ సర్వే చేపట్టనుంది. నగరంలోని ఆదిభట్ల, బాలాపూర్‌, మియాపూర్‌, చందానగర్‌, టప్పా చబుత్రా కంటైన్మెంట్ జోన్లలో సర్వెలైన్స్ సర్వే నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రతి జోన్‌కు 2 చొప్పున 10 ప్రత్యేక టీమ్‌ల ద్వారా సర్వేకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈ ఐదు కంటైన్మెంట్‌ జోన్లలో కరోనా కేసులు, వాటి పరిస్థితి, లక్షణాలపై ఇంటింటా సర్వే నిర్వహిస్తారు. అనంతరం హైదరాబాద్‌లో పెరుగుతున్న కేసులు, లక్షణాలు లేనటువంటి కేసులపై ఐసీఎంఆర్‌ పూర్తిస్థాయి నివేదిక తయారుచేయనుంది. ఆ నివేదికను కేంద్ర వైద్యఆరోగ్యశాఖకు సమర్పిస్తారు. గతంలో తెలంగాణలోని జనగామ, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఇప్పటికే సర్వే జరిపారు. ICMR నివేదికల ఆధారంగానే లాక్‌డౌన్‌ పొడిగింపుపై కేంద్రం నిర్ణయం తీసుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సర్వే చేపట్టారు. నివేదిక ఆధారంగా లాక్‌డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకోనుంది కేంద్ర ప్రభుత్వం.
First published: May 30, 2020, 6:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading