ఆ రాష్ట్రంలోకి వెళ్లాలంటే.. కరోనా లేదని సర్టిఫికెట్ చూపెట్టాల్సిందే..

రాష్ట్రంలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ కరోనా లేదని సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. ICMR ద్వారా అప్రూవ్ చేయబడిన కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతిస్తామని సీఎం స్పష్టం చేశారు.

news18-telugu
Updated: May 27, 2020, 4:26 PM IST
ఆ రాష్ట్రంలోకి వెళ్లాలంటే.. కరోనా లేదని సర్టిఫికెట్ చూపెట్టాల్సిందే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఒక రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే వారు ఖచ్చితంగా క్వారంటైన్‌లో ఉండాలి. ఆయా రాష్ట్రప్రభుత్వాల నిబంధనల మేరకు అడ్మినిస్ట్రేటివ్ క్వారంటైన్ లేదా హోం క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. కానీ ఈ విషయంలో గోవా కీలక నిర్ణయం తీసుకుంది. గోవాలోకి వచ్చే వారికి 14 రోజుల హోమ్ క్వారంటైన్ విధానాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు గోవా సీఎం ప్రమోద్ కుమార్ సావంత్ తెలిపారు. ఐతే రాష్ట్రంలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ కరోనా లేదని సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. ICMR ద్వారా అప్రూవ్ చేయబడిన కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే గోవాలోకి అనుమతిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఆ సర్టిఫికెట్ లేకుండా ఖచ్చితంగా కరోనా పరీక్ష చేయించుకోవాల్సిందేనన్నారు గోవా సీఎం.

కాగా, గోవా వైద్యఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. ఇప్పటి వరకు అక్కడ 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 19 మంది కోలుకున్నారు. ఎవరూ చనిపోలేదు. ప్రస్తుతం గోవాలో 48 కరోనా యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.
First published: May 27, 2020, 4:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading