Salary Hike: కరోనా కష్టకాలంలోనూ ఆ బ్యాంకు ఉద్యోగుల జీతాలు పెరిగాయి

Salary Hike | కరోనా వైరస్ సంక్షోభ కాలంలో ఉద్యోగాలు పదిలంగా ఉండటమే మేలని అనేక మంది అనుకుంటున్నారు. కానీ ఆ బ్యాంకు తమ ఉద్యోగులకు జీతాలు పెంచి వారిలో స్థైర్యాన్ని పెంచింది.

news18-telugu
Updated: July 8, 2020, 11:17 AM IST
Salary Hike: కరోనా కష్టకాలంలోనూ ఆ బ్యాంకు ఉద్యోగుల జీతాలు పెరిగాయి
Salary Hike: కరోనా కష్టకాలంలోనూ ఆ బ్యాంకు ఉద్యోగుల జీతాలు పెరిగాయి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
అసలే కరోనా కష్టకాలం. అనేక రంగాల్లో ఉద్యోగాలకు ముప్పు ఉంది. ఉద్యోగాలు పదిలంగా ఉంటే చాలని చాలామంది ఉద్యోగులు అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఐసీఐసీఐ బ్యాంకు 80,000 మందికి పైగా ఉద్యోగులకు 8% వరకు జీతాలు పెంచింది. 80% మంది ఉద్యోగులకు జీతాలు పెరిగాయి. ఐసీఐసీఐ బ్యాంకు భారతదేశంలో ప్రైవేట్ రంగంలో రెండో అతిపెద్ద బ్యాంక్. మిగతా బ్యాంకుల్లాగానే కరోనా వైరస్ సంక్షోభంలో ఐసీఐసీఐ ఉద్యోగులు తమ కస్టమర్లకు సేవలు అందించారు. కరోనా వైరస్ సంక్షోభ కాలంలో అందించిన సేవల్ని గుర్తిస్తూ ఈ రివార్డ్ ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జూలై నుంచి 8 శాతం వరకు జీతాల పెంపు అమలులో ఉంటుంది.

SBI Health Policy: తక్కువ ధరకే ఎస్‌బీఐ ఆరోగ్య సంజీవని పాలసీ... లాభాలు ఇవే

కరోనా కష్టకాలంలో అప్పులు ఇస్తున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

ఎం1 లెవెల్‌తో పాటు అంతకన్నా తక్కువ గ్రేడ్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు కరోనావైరస్ సంక్షోభంలో కస్టమర్లకు సేవలు అందించేందుకు కృషి చేశారు. లాక్‌డౌన్ సమయంలో ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచ్‌లు, కార్యకలాపాలు నిర్వహించడంలో వీరి పాత్ర కీలకం. అందుకే వారి కృషిని ఐసీఐసీఐ బ్యాంకు గుర్తించి జీతాలు పెంచింది. ప్రస్తుతం ఈ కష్టకాలంలో చాలావరకు కంపెనీలు జీతాల పెంపును నిలిపివేయడం లేదా కోతలు విధించడం చూస్తున్నాం. కానీ ఐసీఐసీఐ బ్యాంకు మాత్రం జీతాలు పెంచి ఉద్యోగుల్లో స్థైర్యాన్ని పెంచింది.

(ఈ ఆర్టికల్ మొదట Moneycontrol వెబ్‌సైట్‌లో పబ్లిష్ అయింది. ఒరిజినల్ ఆర్టికల్‌ను ఇక్కడ చదవొచ్చు.)
Published by: Santhosh Kumar S
First published: July 8, 2020, 11:17 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading