హైదరాబాద్‌లో రెండు వేల వాహనాలు సీజ్.. బయటికి వస్తే అరెస్టులే..

కరోనా వ్యాపిస్తోంది.. బయటికి రాకండి మొర్రో.. అని మొత్తుకున్నా కొందరు జనాల బుర్రకు ఎక్కడం లేదు. ఎంత చెప్పినా, హెచ్చరించినా వినిపించుకోవడం లేదు.

news18-telugu
Updated: March 24, 2020, 9:17 AM IST
హైదరాబాద్‌లో రెండు వేల వాహనాలు సీజ్.. బయటికి వస్తే అరెస్టులే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వ్యాపిస్తోంది.. బయటికి రాకండి మొర్రో.. అని మొత్తుకున్నా కొందరు జనాల బుర్రకు ఎక్కడం లేదు. ఎంత చెప్పినా, హెచ్చరించినా వినిపించుకోవడం లేదు. కొందరు ఆకతాయిలైతే బైక్‌లు పట్టుకొని వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. రయ్.. రయ్.. అంటూ బైక్‌లతో విన్యాసాలు చేస్తున్నారు. దీంతో పోలీసులు చట్టాలకు పని చెప్పాల్సి వస్తోంది. హైదరాబాద్‌లో ఒక్క రోజులోనే(మార్చి 23) 2వేలకు పైగా వాహనాలను సీజ్ చేసి, కేసులు నమోదు చేశారు. వీటిలో 1058 బైక్‌లు, 948 ఆటోలు, 429 కార్లు, ఇతర ఫోర్ వీలర్లు, 45 ఇతర వాహనాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఉదయం పూట ఎక్కువగా జనం రోడ్లపైకి రావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో సోమవారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్‌లోని అన్ని మార్గాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి కఠన చర్యలు తీసుకున్నారు. నగరంలోని 25 ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 73 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మొత్తం 2480 వాహనాలను సీజ్‌ చేశారు.

అటు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ వ్యక్తి రోడ్డుపైకి రావడమే కాకుండా, జిల్లా కలెక్టర్‌తో వాదనకు దిగడంతో అతడ్ని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉండగా, లాక్‌డౌన్ నిబంధనలు పాటించకుండా రోడ్లపైకి వచ్చిన వారిపై తెలంగాణ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన GO-45, 46 ప్రకారం.. లాక్‌డౌన్‌ పాటించని వాహనదారులు, ప్రజలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: March 24, 2020, 9:17 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading