గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..

గాంధీ ఆస్పత్రి

హైదరాబాద్‌లోని ప్రముఖ గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. కోవిడ్-19 చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీకి అనుమతి లభించింది.

 • Share this:
  హైదరాబాద్‌లోని ప్రముఖ గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. కోవిడ్-19 చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీకి అనుమతి లభించింది. అంటే.. ఇక, వ్యాధి నుంచి కోలుకున్న వారి నుంచి గాంధీ వైద్యులు ప్లాస్మా సేకరించనున్నారు. కరోనా సోకి ప్రమాదకర స్థితిలో ఉన్న ఉంటే వారికి ప్లాస్మా థెరపీ అందించనున్నారు. ఇటీవలే.. దేశంలోనే తొలిసారి ఓ కరోనా పేషెంట్ ప్లాస్మా థెరపీతో పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. కరోనా లక్షణాలతో ఢిల్లీ సాకేత్‌ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన 49 ఏళ్ల బాధితుడికి చేసిన ప్లాస్మా థెరపీ చేశారు. ఆ థెరపీతో అతడు పూర్తిగా కోలుకున్నాడు. కరోనాకు మందు లేకపోవటంతో ప్రస్తుతం ప్లాస్మా థెరపీనే చేస్తున్నారు. ఈ విధానంలో కరోనా నుంచి కోలుకున్న పేషెంట్ రక్తం నుంచి ప్లాస్మా సేకరిస్తారు. అందులోని యాంటీ బాడీలను కరోనా పేషెంట్లకు ఎక్కిస్తారు. యాంటీ బాడీలో రక్తం లోకి వెళ్లి కరోనా వైరస్ తో ఫైట్ చేస్తాయి. ఐతే ప్లాస్మా థెరపీ లో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యే డోనర్స్ అవసరం ఉంటుంది.

  కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 332 మంది కోలుకోగా.. 25 మంది మరణించారు. రాష్ట్రలో ప్రస్తుతం 646 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. ఇందులో.. 32 మంది ప్లాస్మా దానమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్.. మంత్రులు ఈటల రాజేందర్‌, మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశారు కూడా. వారికి సంబంధించిన వివరాలను కూడా ఎంపీ లేఖకు జత చేశారు. ఇదిలా ఉండగా, తెలంగాణలో నిన్న కేవలం 2 కేసులే నమోదవడం శుభపరిణామం. ఆ రెండు కేసులు కూడా జీహెచ్ఎంసీ పరిధిలోవే.

  తెలంగాణలోని 10 జిల్లాల్లో (ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, వరంగల్ రూరల్, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మంచిర్యాల) ప్రస్తుతం ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు. మరో 11 జిల్లాలు(జగిత్యాల, జనగామ, పెద్దపల్లి, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నల్గొండ) మంగళవారం (ఏప్రిల్ 28) నాటికి ఒక్క పాజిటివ్ కేసు కూడా లేని జిల్లాలుగా మారనున్నాయి.
  Published by:Shravan Kumar Bommakanti
  First published: