Home /News /coronavirus-latest-news /

HYDERABAD CHEST HOSPITAL HEAD NURSE DEAD DUE TO CORONAVIRUS BA

హైదరాబాద్‌లో కరోనాతో నర్సు కన్నుమూత .. నాలుగు రోజుల్లో రిటైర్మెంట్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మరో నాలుగు రోజుల్లో రిటైర్మెంట్ కాబోతున్న ప్రభుత్వ ఆస్పత్రిలో హెడ్ నర్సును పొట్టనపెట్టుకుంది కరోనా మహమ్మారి.

    మరో నాలుగు రోజుల్లో రిటైర్మెంట్ కాబోతున్న ప్రభుత్వ ఆస్పత్రిలో హెడ్ నర్సును పొట్టనపెట్టుకుంది కరోనా మహమ్మారి. హైదరాబాద్‌లో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ ఛాతీ ఆస్పత్రిలో పనిచేస్తున్న హెడ్ నర్సు గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ పేషెంట్లకు సేవలు అందించారు. ఈ క్రమంలో ఆమెకు కూడా కరోనా వైరస్ సోకింది. ఆమె పరిస్థితి బాగోకపోవడంతో వైద్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీలో చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం కన్నుమూసింది. మహమ్మారి బారిన పడిన వ్యాధిగ్రస్తులను కాపాడుతూ.. చివరికి ఆమె కూడా కరోనాతో మృత్యు ఒడిలోకి చేరుకుంది. ఈనెల 30వ తేదీన రిటైర్మెంట్ కాబోతోంది. అంతలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమె భర్తకు కూడా కరోనా వైరస్ సోకింది.

    కరోనా వైరస్ మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టేందుకు డాక్టర్లు, నర్సులు, శానిటైజేషన్ వర్కర్లు, ఇతరత్రా వైద్య సిబ్బంది భారీ ఎత్తున పోరాడుతున్నారు. కంటికి కనిపించని వైరస్‌తో బయటకు కనిపించని యుద్ధం చేస్తున్నారు. ఈ పోరాటంలో తమకేమైనా జరిగితే తమ కుటుంబాలు ఏమైపోతాయన్న భయాన్ని, ఆందోళనను కూడా పక్కన పెట్టి పోరాటం చేస్తున్నారు. అలా పోరాడుతున్న వారికి మనోథైర్యం కలిగించేందుకు కేంద్రం కొన్ని రోజుల క్రితం భారీ ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మీద పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఇతరత్రా వైద్య సేవల్లో నిమగ్నమై ఉన్న సుమారు 20 లక్షల మందికి లబ్ధి చేకూర్చేలా ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్కరికి రూ.50 లక్షల ఇన్సూరెన్స్ ప్రకటించింది. కరోనా మీద పోరాడుతున్న యోధులకు మనోధైర్యం కల్పించేందుకు ఈ రకంగా అడుగులు ముందుకు వేసింది.

    తెలంగాణలో రోజు రోజుకూ కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీ ఎత్తున పెరిగిపోతోంది.  జూన్ 25న కొత్తగా రాష్ట్రంలో 920 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,364కు పెరిగింది.  ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 230గా ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 70,934 కరోనా టెస్టులను నిర్వహించారు. అందులో 59570 నెగిటివ్ వచ్చాయి. 11364 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. వారిలో 4688 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 230 మంది చనిపోయారు. ప్రస్తుతం 6446 యాక్టివ్ కేసులు చికిత్స పొందుతున్నారు.
    First published:

    Tags: Coronavirus, GHMC, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు