తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇక కరోనా పరీక్షలు ఇక్కడే..

హైదరాబాద్‌లోని సీసీఎంబీ (సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ)లోనే కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు.

news18-telugu
Updated: March 24, 2020, 6:44 AM IST
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇక కరోనా పరీక్షలు ఇక్కడే..
ప్రతీకాత్మక చిత్రం (image - NIAID)
  • Share this:
కరోనా పరీక్షల కోసం ఇప్పటిదాకా పూణె దాకా వెళ్లాల్సి వచ్చేది. కానీ, ఇప్పటి నుంచి అక్కడి దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌లోని సీసీఎంబీ (సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ)లోనే కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. నేటి నుంచే పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్నీ సిద్ధం చేశారు. పరీక్షల కోసం అత్యాధునికమైన 12 రియల్‌ టైమ్‌ పీసీఆర్‌లను సిద్ధం చేసినట్టు సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా తెలిపారు. పరీక్షల నిర్వహణకు 20 మంది నిపుణులను నియమించామన్నారు. లైఫ్‌ సైన్సెస్‌ పరిశోధనల్లో అగ్రస్థానంలో ఉన్న సీసీఎంబీని కరోనా పరీక్షలు చేసేందుకు అవకాశమివ్వాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని విజ్ఞప్తి చేశారు.

నేటి నుంచి నమూనాలను పంపితే పరీక్షలను నిర్వహిస్తామని గాంధీ, ఉస్మానియా దవాఖానాల అధికారులకు సీసీఎంబీ సమాచారమిచ్చింది. రోజుకు 500కు పైగా నమూనాలను ఇక్కడ పరిశీలించేలా ఏర్పాట్లు ఉన్నాయి.
First published: March 24, 2020, 6:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading