Corona Treatment: కోవిడ్ బాధితుల‌కు గుడ్ న్యూస్.. అతి త‌క్కువ ఖ‌ర్చుతో ట్రీట్ మెంట్...

Corona Treatment: కోవిడ్ బాధితుల‌కు గుడ్ న్యూస్.. అతి త‌క్కువ ఖ‌ర్చుతో ట్రీట్ మెంట్...

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం ఏ కరోనా హాస్పిటల్లో (Corona Hospitals) చూసినా పేషెంట్లను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఐతే ఓ సంస్థ మాత్రం తక్కువ ధరకే కరోనాకు ట్రీట్ మెంట్ ఇస్తోంది.

  • Share this:
    దేశ‌వ్యాప్తంగా కోవిడ్ కేసులు రోజురోజు విఫ‌రీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టికే గురువారం ఒక్క‌రోజు దేశ‌వ్యాప్తంగా 3 ల‌క్ష‌ల‌కు పైగా కోవిడ్ కేసులు న‌మోదు అయ్యాయంటే ప‌రిస్థ‌తి ఎలా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టికే అన్ని రాష్ట్రాల్లో ఆసుప‌త్రులు కోవిడ్ భాదితుల‌తో కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప‌రిస్థ‌తికి కూడా రోజురోజుకి చాలా దారుణంగా మారుతుంద‌నే చెప్పుకోవాలి. బుధవారం ఒక్క‌రోజు తెలంగాణలో 6 వేల‌కు పైగా, ఆంధ్రప్రదేశ్ లో 9వేలకు పైగా కోవిడ్ కేసులు న‌మోదు అవ్వ‌డంతోపాటు రెండు రాష్ట్రాల్లో కలిపి 58 మంది ప్రాణాలు కోల్పోయారు. హైద‌రాబాద్ లో ఉన్న అన్ని ఆసుప‌త్రులు క్కికిరిసిపోతున్నాయి. బెడ్లు కొర‌త‌, ఆక్సిజ‌న్ కొర‌త వ‌ల‌న కోవిడ్ భాదితులు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. చ‌చ్చీచెడి బెడ్ సంపాధించినా ఈ కార్పొరేట్ ఆసుప‌త్రులు వేసే బిల్లులు క‌ట్ట‌లేక అప్పుల పాలవుతున్నారు. ఈ స‌మ‌యంలో కోవిడ్ భాదితులకు బాస‌ట‌గా నిలుస్తోంది హైదరాబాద్ కు చెందిన ఒక స్వ‌చ్చంధ సంస్థ. అతి త‌క్కువ ఖ‌ర్చుతో కోవిడ్ పెషెంట్స్ కు చికిత్స అందించ‌డానికి ముందుకొచ్చింది.

    న‌గ‌రంలో ఉన్న జైన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ట్రేడ్ ఆర్గ‌నేజేష‌న్ మ‌రియు మ‌హావీర్ ఆసుప‌త్రి రీస‌ర్చ్ సెంట‌ర్ సంయుక్తంగా కోవిడ్ భాదితుల కోసం లో కాస్ట్ కోవిడ్ ట్రీట్మెంట్ సెంట‌ర్ ను ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 1 కేర్ ఆసుప‌త్రి ప‌క్క‌న ఉన్న ఈ కోవిడ్ సెంట‌ర్ లో ఏడు రోజుల ట్రిట్మంట్ కు సింగిల్ రూమ్ అయితే 40 వేలు డ‌బుల్ ఆక్యూప‌న్సీ అయితే 30 వేలు ఛార్జ్ చేస్తోన్నారు. 24 గంట‌ల డాక్ట‌ర్స్ అందుబాటులో ఉండ‌డ‌మే కాకుండా అతి త‌క్కువ ఖ‌ర్చుతో కోవిడ్ భాధితుల‌కు ట్రీట్మ్ంట్ ఇవ్వ‌డ‌మే ద్యేయం అంటున్నారు స్వ‌చ్చంధ సంస్థ ప్ర‌తినిధులు.

    ఈ నెల 18 నుంచి అందుబాటులోకి వ‌చ్చిన ఈ ఆసుప‌త్రిలో దాదాపు 100 బెడ్స్ తోపాటు 24 గంట‌లు ఆక్సిజ‌న్ లాంటి అత్య‌వ‌స‌ర స‌దుపాయాలు కూడా అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం కూడా ఈ ఆసుప‌త్రికి అన్ని అనుమ‌తులు ఇచ్చింది. ఇందులో అడ్మిట్ అవ్వాలంటే ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ ఖ‌చ్చితంగా ఉండాలి దింతో పాటు కోవిడ్ రోగి ఆక్సిజ‌న్ లెవెల్స్ ఖ‌చ్చితంగా 95 పైగానే ఉండ‌డంతోపాటు రోగి వ‌య‌స్సు 15 ఏళ్లు నుంచి 60 ఏళ్లు లోపు ఉండాలి అని చెబుతున్నారు ఆసుప‌త్రి ప్ర‌తినిధులు. ఏడు రోజుల ఐసోలేష‌న్ ట్రిట్మ్ంట్ లో ఫుడ్ కూఆ ఆసుప‌త్రి వాళ్లు చూసుకుంటారు. పెషెంట్స్ కు మూడు పుట్ల శాఖాహార భోజనం అందించడంతో పాటు అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో అందించేందుకు 24 గంట‌లు ఆక్సిజ‌న్ అందుబాటులో ఉంటుంది అని చెబుతున్నారు. రోజుకి రెండు సార్లు డాక్ట‌ర్స్ చెకప్స్ తో పాటు కోవిడ్ కిట్ ల‌ను కూడా బాధితుల‌కు అందిస్తోన్నారు స్వ‌చ్చంధ సంస్థ ప్ర‌తినిధులు.

    ఈ ఆసుత్రిలో బెడ్స్ కోసం 91211-55500/91212-55500/91213-55500 ఈ నెంబర్లుకు కాల్ చేస్తే మీ వివరాలు తీసుకొని ఆడ్మిషన్ ప్రోసెస్ గురించి ఆస్పత్రి సిబ్బంది వివరిస్తారు.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు