హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Corona: ఈ జంట బాధకు కన్నీళ్లు ఆగవు.. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. అంతా కరోనా వల్లే..

Corona: ఈ జంట బాధకు కన్నీళ్లు ఆగవు.. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. అంతా కరోనా వల్లే..

సౌమిల్, నిరాళి(ఇన్‌సెట్‌లో బిడ్డ)

సౌమిల్, నిరాళి(ఇన్‌సెట్‌లో బిడ్డ)

ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. ఆ బిడ్డను కళ్లారా చూసుకునే పరిస్థితి గానీ, చేతులారా నిమిరే పరిస్థితి కానీ నిరాళికి లేకపోయింది. ఆమెకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో బిడ్డను ఆమె నుంచి దూరంగా ఉంచి మరో బిల్డింగ్‌లో ఉంచి ఆ బిడ్డకు కూడా కరోనా టెస్ట్ చేశారు. అదృష్టవశాత్తూ...

ఇంకా చదవండి ...

అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. కరోనా మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అంత్యక్రియల నిర్వహించేందుకు స్మశానాల దగ్గర కరోనా శవాలతో ఉన్న అంబులెన్స్‌‌లతో బంధువులు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. కరోనా సోకిన వారికి బెడ్లు దొరక్క నానా బాధలు పడుతున్నారు. కరోనా సోకి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న పేషంట్లకు మెడికల్ ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోకి ప్రజలను నెట్టేసిన కరోనా ఓ కన్న తల్లికి, తండ్రికి ఏ తల్లిదండ్రులూ ఎదుర్కోకూడని పరీక్ష పెట్టింది. అప్పుడే పుట్టిన బిడ్డను చేతుల్లోకి తీసుకునే అవకాశాన్ని కూడా ఆ తల్లిదండ్రులకు లేకుండా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్‌లోని బొపల్ ప్రాంతానికి చెందిన నిరాళి, సౌమిల్ పాండ్యా(29) భార్యాభర్తలు. నిండు గర్భిణి అయిన నిరాళికి డెలివరీ డేట్ వచ్చే లోపు ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమె డెలివరీకి మరో రెండుమూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో హాస్పిటల్‌లో బెడ్ కోసం సౌమిల్ పాండ్యా నానా యాతన పడ్డాడు. దాదాపు 12 గంటలు శ్రమ పడిన తర్వాత ఎట్టకేలకు కోవిడ్ హాస్పిటల్‌లోని ఆపరేషన్ థియేటర్‌లో నిరాళి ప్రసవ సమయానికి బెడ్ దొరికింది. ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. ఆ బిడ్డను కళ్లారా చూసుకునే పరిస్థితి గానీ, చేతులారా నిమిరే పరిస్థితి కానీ నిరాళికి లేకపోయింది. ఆమెకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో బిడ్డను ఆమె నుంచి దూరంగా ఉంచి మరో బిల్డింగ్‌లో ఉంచి ఆ బిడ్డకు కూడా కరోనా టెస్ట్ చేశారు. అదృష్టవశాత్తూ ఆ ఆడబిడ్డకు నెగిటివ్ వచ్చింది. అయితే.. ఆ బిడ్డను ఎత్తుకునే అవకాశం ఆ తల్లిదండ్రులిద్దరికీ లేకుండా పోయింది. సౌమిల్‌కు కూడా ఆర్‌-పీసీఆర్ టెస్ట్ చేశారు. ఆ టెస్ట్ రిపోర్ట్ కోసం గత రెండు రోజులుగా ఆ తండ్రి ఎదురుచూస్తున్నాడు. రిపోర్ట్‌లో నెగిటివ్ వస్తే గానీ ఆ బిడ్డ దగ్గరకు వెళ్లే పరిస్థితి సౌమిల్‌కు లేదు.

నిరాళి కూడా మరో మూడునాలుగు రోజుల తర్వాత గానీ కన్నబిడ్డను చూసుకునే పరిస్థితి లేదు. అది కూడా.. ఆమెకు కరోనా నెగిటివ్ వస్తేనే. కడుపున పుట్టిన బిడ్డను కళ్లారా చూసుకునే భాగ్యం కూడా లేకుండా పోయిందని ఆ తల్లిదండ్రులు వేదన చెందుతున్న తీరు కలచివేసింది. ఏ తల్లిదండ్రులకూ ఇలాంటి పరిస్థితి రాకూడదు. మనుషుల ప్రాణాలను హరిస్తున్న కరోనా మానవ సంబంధాల మధ్య అంతరానికి కూడా కారణం కావడం శోచనీయం.

ఇదిలా ఉంటే.. కరోనా సోకిన గర్భిణి స్త్రీలకు డెలివరీ సమయానికి బెడ్ దొరకడం కష్టంగా మారింది. కరోనా సోకిన గర్భిణి స్త్రీలకు సహజ ప్రసవం చేసే పరిస్థితులు ఉండవు. కచ్చితంగా ఆసుపత్రిలో చేయాల్సిన పరిస్థితి ఉండటంతో బెడ్లు దొరకడం కష్టంగా మారింది. దాదాపు ఆసుపత్రులన్నీ కరోనా బాధితులతో నిండిపోయి ఉండటంతో వారికి ఆపరేషన్ థియేటర్‌లో బెడ్ దొరకడం గగనంగా మారింది.

First published:

Tags: Ahmedabad, Corona, Covid-19

ఉత్తమ కథలు