ఆకలి కేకలేస్తోన్న అమెరికా.. ఫుడ్ బ్యాంకుల ముందు పడిగాపులు..

ఉపాధి లేక, తినడానికి తిండి లేక అమెరికా ప్రజలు అల్లాడిపోతున్నారు. ఫుడ్ బ్యాంకుల చుట్టూ తిరుగుతూ నిత్యావసరాల కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు.

news18-telugu
Updated: April 20, 2020, 6:44 AM IST
ఆకలి కేకలేస్తోన్న అమెరికా.. ఫుడ్ బ్యాంకుల ముందు పడిగాపులు..
ఫుడ్ బ్యాంక్ ముందు బారులు తీరిన కార్లు
  • Share this:
ప్రపంచ దేశాలను తన కనుసన్నల్లో ఉంచుకొనే అగ్రరాజ్యం అది.. దేన్నైనా డబ్బులిచ్చి కొనేసుకోగల సామర్థ్యం ఆ దేశానిది.. కానీ, కరోనా దెబ్బకు ఆకలి అంటూ కేకలు వేస్తోంది. ఉపాధి లేక, తినడానికి తిండి లేక అమెరికా ప్రజలు అల్లాడిపోతున్నారు. ఫుడ్ బ్యాంకుల చుట్టూ తిరుగుతూ నిత్యావసరాల కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. నెలవారీ సరుకుల కోసం కుటుంబాలతో సహా క్యూ కడుతున్నారు. ఫుడ్ బ్యాంకుల ముందు కనుచూపు మేర కార్లు బారులు తీరి ఉంటున్నాయి. లాక్‌డౌన్‌ దెబ్బకు వ్యాపారాలన్నీ మూతపడటంతో 2 కోట్ల మందికి పైగా రాత్రికి రాత్రి రోడ్డున పడ్డారు. గతంలో ఎన్నడూ ఫుడ్‌ బ్యాంక్‌ల వైపు చూడని వాళ్లు కూడా ఇప్పుడు ఆహారం కోసం క్యూలో గంటల తరబడి నిల్చుంటున్నారు. కాగా, మంగళవారం పెన్సిల్వేనియాలోని గ్రేటర్‌ పిట్స్‌బర్గ్‌ కమ్యూనిటీ ఫుడ్‌ బ్యాంకు ముందు వేలాది కార్లు లైన్లో ఉన్నాయి. టెక్సస్, కాలిఫోర్నియాలోనూ ఇదే పరిస్థితి. అమెరికా అంతటా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, అమెరికాలో మొత్తం 7,63,832 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే అక్కడ 1539 మరణాలు చోటుచేసుకున్నాయి. కొత్తగా 25 వేల కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 40,553 మంది కరోనాతో మృతిచెందారు. 71 వేల మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
First published: April 20, 2020, 6:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading