భారీ సంఖ్యలో చనిపోయిన గబ్బిలాలు.. కరోనా వైరస్‌తో..

కరోనా వైరస్ వల్లే చనిపోయాన్న ఉద్దేశంలో ఆ గ్రామంలోని ప్రజల్లో భయాందోళనలు రేకెత్తాయి. అయితే గబ్బిలాలు అధిక ఉష్ణోగ్రత, తాగేందుకు నీరు దొరక్కపోవడంతోనే గబ్బిలాలు చనిపోయి ఉండొచ్చని అటవీ శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు.

news18-telugu
Updated: May 27, 2020, 7:34 AM IST
భారీ సంఖ్యలో చనిపోయిన గబ్బిలాలు.. కరోనా వైరస్‌తో..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారీ సంఖ్యలో గబ్బిలాలు చనిపోవడంతో అక్కడి స్థానికుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారి గబ్బిలాల కారణంగాను వ్యాపించిందన్న ప్రచారం నేపథ్యంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బేల్‌ఘాట్ గ్రామంలో భారీ సంఖ్యలో గబ్బిలాలు మృత్యువాత పడ్డాయి. అవి కరోనా వైరస్ వల్లే చనిపోయాన్న ఉద్దేశంలో ఆ గ్రామంలోని ప్రజల్లో భయాందోళనలు రేకెత్తాయి. అయితే గబ్బిలాలు అధిక ఉష్ణోగ్రత, తాగేందుకు నీరు దొరక్కపోవడంతోనే గబ్బిలాలు చనిపోయి ఉండొచ్చని అటవీ శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. అయితే చనిపోయిన గబ్బిలాలను బైరెల్లీలోని భారత జంతు పరిశోధన సంస్థకు పంపించామని, నివేదిక వచ్చిన తర్వాత గబ్బిలాల మృతికి గల కారణాలపై స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు.
First published: May 27, 2020, 7:34 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading